ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంజీయూ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్‌

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:42 AM

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి నూతన వీసీ (ఉపకులపతి)గా అల్తాఫ్‌ హుస్సేన్‌ను నియమిస్తూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించారు. అందులో భాగంగా అల్తాఫ్‌ హుస్సేన్‌ నియమితులయ్యారు.

నల్లగొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి నూతన వీసీ (ఉపకులపతి)గా అల్తాఫ్‌ హుస్సేన్‌ను నియమిస్తూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించారు. అందులో భాగంగా అల్తాఫ్‌ హుస్సేన్‌ నియమితులయ్యారు. ఆయన గతంలో 2016 జూలై నుంచి 2019 జూన్‌ 29వ తేదీ వరకు ఎంజీయూ వీసీగా సేవలందించారు. ఎంజీయూ మొట్టమొదటి న్యాక్‌ అక్రిడేషన్‌కు ఆయన నాయకత్వం వహించి బీ-గ్రేడ్‌ సాధనకు కృషి చేశారు. ఆయన హయాంలో ఇంజనీరింగ్‌ కళాశాల, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, అదనపు హాస్టల్స్‌, పరీక్షల విభాగం భవనాలకు శంకుస్థాపనలు చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న అల్తాఫ్‌ హుస్సేన్‌ నియామకంపై పలువురు అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

కష్టపడి ఎదిగిన అల్తాఫ్‌ హుస్సేన్‌

మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌ కష్టపడి ఎదిగారు. వరంగల్‌ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఆయన తండ్రి పూర్వపు ఆజంజాహి మిల్లులో చిరుద్యోగి. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలోనే బీఎస్పీ, ఎంఎస్సీ (ఫిజిక్స్‌) చేసిన అల్తాఫ్‌ హుస్సేన్‌ పీజీలో టాపర్‌గా, గోల్డ్‌మెడలిస్ట్‌గా నిలిచారు. అనంతరం అదే యూనివర్సిటీలో పీహెచ్‌డీ కూడా చేశారు. కాకతీయ యూనివర్సిటీలో 1982లో అడ్‌హక్‌ లెక్చరర్‌గా ప్రారంభమైన ఆయన ఉద్యోగ జీవితం బోధకుడిగా, పరిశోధకుడిగా సాగింది. అనంతరం లెక్చరర్‌గా, సీనియర్‌ స్కేల్‌ లెక్చరర్‌గా, రీడర్‌ కమ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, ఆ తరువాత ప్రొఫెసర్‌గా కొనసాగారు. ఆ సమయంలోనే ఫిజిక్స్‌ విభాగాధిపతిగా, సీనియర్‌ ప్రొఫెసర్‌గా, పరీక్షల విభాగం, ఇతర పలు విభాగాల ఇన్‌చార్జిగా పనిచేశారు. నల్లగొండ ఎంజీ యూనివర్సిటీకి 2016-19లో ఆయన వీసీగా పనిచేశారు. అనంతరం మళ్లీ కేయూకి వెళ్లిన ఆయన ఇప్పటివరకు అక్కడ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేశారు. తన పరిశోధనల్లో భాగంగా ఆయన 40 జర్నల్స్‌ను ప్రచురించారు. 1989లో సోవియట్‌ రష్యాలోనూ కొంతకాలం పరిశోధనలు సాగించారు. ఆయన సతీమణి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నతవిద్యాభ్యాసం చేసి, వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పురోభివృద్ధికి తోడ్పడ్డ అల్తాఫ్‌ హుస్సేన్‌ మరోసారి వైస్‌ఛాన్సలర్‌గా రావడంపై యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 19 , 2024 | 12:42 AM