ఓటరు జాబితా సవరణ నిర్వహించాలి
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:54 AM
జిల్లాలో 2024-25కు సంబంధించిన ఓటరు జాబితా సవరణను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనపై సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
భువనగిరి కలెక్టరేట్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2024-25కు సంబంధించిన ఓటరు జాబితా సవరణను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనపై సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓటర్ల దరఖాస్తుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అర్హులైన ఓటర్లు వారి పేర్లను నవంబరు 6లోపు నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 2025 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి తప్పనిసరిగా ఓటుహక్కు కల్పించాలన్నారు. యువ ఓటర్ల నమోదుతో పాటు దివ్యాంగులు, థర్డ్‌జెండర్, ఆదివాసీ గిరిజనుల ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించి ఈ నెల 29న డ్రాప్ట్ ఓటరు జాబితా విడుదల చేయాలన్నారు. అభ్యంతరాలను నవంబరు 29లోగా తీసుకొని వాటిని డిసెంబరు 26వరకు పరిష్కరించి జనవరి 6న తుది ఓటరు జాబితా వెలువరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంతు కే.జెండగే, అదనపు కలెక్టర్లు గంగాధర్, బెన్‌షాలోమ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, ఆర్డీవో అమరేందర్, ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ శ్రీనివా్‌సరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:54 AM