ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోషకాహార లోపం పీడిస్తోంది

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:01 AM

విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందిన ట్టు. అందుకోసం ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్య రక్షణపై దృష్టిసారించా యి. అందులో భాగంగా వారికి ప్రభు త్వం ఆరోగ్య పరీక్షలు చేయిస్తోంది.

రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులు

జిల్లాలో 20వేల మంది గుర్తింపు

10వేల మంది విద్యార్థులకు పలు వ్యాధులు

ఆర్‌బీఎ్‌సకే ఆరోగ్య పరీక్షల్లో వెల్లడి

(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట(కలెక్టరేట్‌): విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందిన ట్టు. అందుకోసం ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్య రక్షణపై దృష్టిసారించా యి. అందులో భాగంగా వారికి ప్రభు త్వం ఆరోగ్య పరీక్షలు చేయిస్తోంది. అయితే ఈ పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో సుమారు 20వేల మంది విద్యార్థులు పోషకాహార లోపంతో ఏర్పడిన రక్తహీనతతో బాధపడుతున్నారు. అంతేగాక 10వేల మంది విద్యార్థులు పలు రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య్‌ కార్యక్రమానికి (ఆర్‌బీఎ్‌సకే) రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని అమలుకు సంచార వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఇద్ద రు వైద్యులతో పాటు మరో ఇద్దరు ఆరోగ్య సిబ్బంది ఉంటా రు.వీరంతా ప్రతీపనిదినంలో వారికి కేటాయించిన ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఒక్కోబృందం కనీసం 120మంది విద్యార్థులకు ఆరో గ్యపరీక్షలు నిర్వహిస్తుంది. ఈపరీక్షల్లో విద్యార్థులకు ఏవై నా వ్యాధులను గుర్తిస్తే వాటి తీవ్రతను బట్టి సంబంధిత పీహెచ్‌సీలు,ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రి, రాష్ట్ర ఆస్పత్రులకు వైద్య చికిత్సల నిమిత్తం పంపుతారు. అయితే ఈ బృందాలు నిర్వహించిన పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు రక్తహీనత (అనీమియా)తో ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించాయి.

20 వేలమందిలో రక్తహీనత

జిల్లాలో రక్తహీనత తో విద్యార్థులు బాధపడుతున్నారు. ప్రధానంగా 12-16 ఏళ్ల బాలికల్లో రక్తహీనత ఉంది. ప్రతీ ఆరుగురిలో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నట్లు సమాచారం. సాధారణంగా హిమోగ్లోబిన్‌ 7 నుంచి 8గ్రాములు ఉండాలి. అయితే విద్యార్థుల్లో 7గ్రాముల కంటే తక్కువ హిమోగ్లోబిన్‌ ఉంది. రక్తహీనతను అధిగమించేందుకు విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 20వేల మంది విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత కారణంగా విద్యార్థుల్లో ఎదుగుదల లోపిస్తోంది. అంతేగాక వారు విద్యాభ్యాసంలో వెనకబడిపోతున్నారు. తరుచూ నీరసంగా ఉంటూ, వారి పనులు వారు చేసుకోలేకపోతున్నారు. అంతేగాక ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. నెలసరి ఉండే బాలికల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటోంది.

జిల్లాలో తొమ్మిది సంచార వైద్యబృందాలు

జిల్లా పరిధిలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య్‌ కార్యక్రమం కింద విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు తొమ్మిది సంచార వైద్య బృందాలు ఉన్నాయి. ఒక్కో వైద్య బృందంలో ఒక ఆయుర్వేద, ఒక అల్లోపతి వైద్యుడితో పాటు ఒక మహిళా ఆరోగ్య కార్యకర్త, ఫార్మసిస్ట్‌ ఉంటారు. వీరు ప్రతిరోజు వారికి కేటాయించిన ప్రాంతంలో 120 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 38 రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలను వీరు నిర్వహిస్తారు. అందులో స్థానికంగా చికిత్స అందించే వ్యాధులకు చికిత్సలు చేసి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే తక్షణ వైద్య సేవల కోసం పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి విద్యార్థులను పంపిస్తారు.

రక్షణ చర్యలు తీసుకోవాలి

రక్తహీనతతో బాధపడుతున్న వారు దాన్ని అధిగమించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. అందుకోసం ప్రభుత్వం అన్ని పీహెచ్‌సీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో ఐరన్‌ ఫోలిక్‌యాసిడ్‌ మాత్రలను విద్యార్థులకు ఉచితంగా అందజేస్తోంది. ఇవేగాక మంచి పోషకాహారాన్ని విద్యార్థులు తీసుకోవాల్సి ఉంది. ఐరన్‌ ఎక్కువగా ఉండే కర్జూరాలు, యాపిల్స్‌, బీట్‌రూట్‌, మాంసం, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.

10వేల మందికి వివిధ వ్యాధులు

జిల్లా పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులు 10వేల మందికి పైగా ఉన్నారు. ఆర్‌బీఎ్‌సకే కార్యక్రమం కింద జిల్లాలోని 1,196 అంగన్‌వాడీ కేంద్రాలు, 30 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 1,055 పాఠశాలల్లో 2,17,677 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అందులో పౌష్ఠికాహార లోపంతో 3,771 మంది, సాధారణ వ్యాధులైన దగ్గు, జలుబుతో 2,346 మంది, చర్మవ్యాధులతో 807మంది, దంత సమస్యలతో 611 మంది, దృష్టి లోపంతో 995 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నెలసరి సమస్యలతో 298 మంది, గుండె సమస్యలతో 79మంది, నరాల వ్యాధులతో 77మంది, వినికిడి లోపంతో 70మంది, మూత్ర సంబంఽఽధిత వ్యాధులతో 91 మంది, పుట్టుకతో వినికిడి లోపంతో 34 మంది, సరైన ఎదుగుదల లేక 931 మంది, వంకర పాదాలతో 45 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీరితో పాటు మరో 102 మంది విద్యార్థులు మానసిక దివ్యాంగులుగా ఉన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం : డాక్టర్‌ కోటి రత్నం, ఆర్‌బీఎ్‌సకే జిల్లా కోఆర్డినేటర్‌

ఆర్‌బీఎ్‌సకే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రక్తహీనతపై అవగాహన కల్పిస్తున్నాం. అంతేగాక విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ పరీక్షల ద్వారా కొంతమంది విద్యార్థులు వివిధ వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించాం. వారందరికీ దశల వారీగా మెరుగైన వైద్య చికిత్సలు చేయిసున్నాం. ఇప్పటికే కొంతమంది విద్యార్థులకు వైద్య చికిత్సలు పూర్తిచేశాం. విద్యార్థులు పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే వ్యాధులను దూరం చేసుకోవ చ్చు.

Updated Date - Oct 21 , 2024 | 01:01 AM