గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:38 AM
టీజీపీఎ్‌ససీ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి సంబంధిత అధికారులకు ట్రైనింగ్ కమ్ కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
15 పరీక్షా కేంద్రాలు.. 6043 మంది అభ్యర్థులు
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
కలెక్టర్ ఎం.హనుమంతరావు
భువనగిరి (కలెక్టరేట్), నవంబరు 13(ఆంధ్రజ్యోతి): టీజీపీఎ్‌ససీ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి సంబంధిత అధికారులకు ట్రైనింగ్ కమ్ కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. బయో మెట్రిక్ విధానంపై అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. నూరుశాతం బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ నెల 17న, 18న జరిగే గ్రూప్-3 పరీక్షలకు జిల్లాలో 3,240 పురుషులు, 2,803 మహిళలు మొత్తం 6043 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, వారి కోసం 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 15మంది చీప్ సూపరింటెండెంట్, 46 మంది బయోమెట్రిక్ అధికారులు, 17 మంది అబ్జర్వర్లు, ముగ్గురు జాయింట్ రూట్ అధికారులు, ఐదుగురు ఐదుగురు స్క్వాడ్, 15మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 65మంది ఐడెంటిఫికేషన్లతోపాటు 253మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్ష 17న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, సాయంత్రం 3గంటల నుంచి 5.30గంటల వరకు పేపర్-2, 18న ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు పేపర్-3 ఉంటుందన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.30గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1.30వరకు చేరుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. టీజీపీఎ్‌సపీ గ్రూప్-3 పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ సైదులు, జాయింట్ కస్టోడియల్ చీఫ్ సూపరిండెంట్లు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
రాజాపేట: విధుల్లో ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినా, సమయపాలన పాటించకపోయినా చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూను పాటిస్తున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Nov 14 , 2024 | 12:38 AM