ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బస్వాపూర్‌ ప్రాజెక్టును పూర్తి చేయాలి

ABN, Publish Date - Oct 26 , 2024 | 12:31 AM

కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.500కోట్లు కేటాయించి పూర్తి చేయాలని నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

భువనగిరి రూరల్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.500కోట్లు కేటాయించి పూర్తి చేయాలని నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం భువనగిరి మండలం వడపర్తిలో మండల మహాసభలో పార్టీ జెండాను ఎగుర వేసి మాట్లాడారు. రిజర్వాయర్‌ నిర్మాణ కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు పూర్తి కావడం లేదని అన్నారు. రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీయనతిమ్మాపురం, లప్పా నాయక్‌ తండా, చోక్లా తండా బాధితులకు, బస్వాపురంలో భూములు కోల్పోయిన వారికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించకపోవడం సరికాదన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు కొండమడుగు నర్సింహ, దాసరి పాండు, దయ్యాల నర్సింహ, పి.భిక్షపతి, కె.పోచయ్య, యాదగిరి, అంజయ్య, మైసయ్య, లక్ష్మి, ముత్యాలు, రాజు ఉన్నారు.

Updated Date - Oct 26 , 2024 | 12:31 AM