ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రూప్‌ పరీక్షలకు సిద్ధంగా ఉండాలి

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:45 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ పరీక్షలకు కేంద్రాలను సిద్ధంచేయాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

స్ర్టాంగ్‌రూం, రూట్‌మ్యాప్‌ ప్రకారం సిబ్బందిని నియమించాలి

టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

భువనగిరి కలెక్టరేట్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ పరీక్షలకు కేంద్రాలను సిద్ధంచేయాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

గ్రూప్‌ పరీక్షలను టీజీపీఎస్సీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లను సిద్ధం చేసి రూట్‌ మ్యాప్‌ల ప్రకారం సిబ్బందిని నియమించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే మాట్లాడుతూ, జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 6,216 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ గంగాధర్‌, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాధరావు, పరీక్షల సూపరింటెండెంట్‌ పార్థసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అథ్లెటిక్స్‌ క్రీడాకారుడికి కలెక్టర్‌ అభినందన

భువనగిరి పట్టణానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ ఆంబోజు అనిల్‌కుమార్‌ అథ్లెటిక్స్‌లో రజిత పతకం సాధించడంతో ఆయన్ను కలెక్టర్‌ అభినందించారు. మలేషియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 12నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్నెషనల్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ షిప్‌లో 400మీటర్ల రిలే ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం, 1,500మీటర్ల పరుగులో ఆరోస్థానంలో నిలవడం గర్వకారణమని కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్భంగా అనిల్‌ను కలెక్టర్‌ సన్మానించారు.

మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి

మానసిక ఆందోళన, ఒత్తిడిలో ఉన్నవారిని గుర్తించి సరైన వైద్యం అందించాలని కలెక్టర్‌ అన్నారు. మానసిక ఆరోగ్య మాసోత్సవంలో భాగంగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు, ఎంఎల్‌హెచ్‌పీలకు కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన శిక్షణలో కలెక్టర్‌ మాట్లాడారు. మానసిక చికిత్స కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 14416లో సంప్రదించేలా దీనిపై ప్రచారం చేయాలన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

గుండాల: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులను కలెక్టర్‌ ఆదేశించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

జన సురక్ష బీమాపై అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే

భువనగిరి కలెక్టరేట్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి జన్‌ సురక్ష పథకాన్ని ప్రతీ ఒక్కరు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాలపై వ చ్చే ఏడాది జనవరి 15 వరకు మూడు నెలల పాటు ప్రచారం నిర్వహించాలన్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారు పీఎంఎ్‌సబీవైకి అర్హులని, ఏడాదికి రూ.20 ప్రీమియంతో ప్రమాదబీమా లభిస్తుందన్నారు. పీఎంజేజేబీవైకి 18-50 ఏళ్ల వయసున్నవారు అర్హులని, వార్షిక ప్రీమియం రూ.436తో అన్నిరకాల మరణాలకు బీమా పొందవచ్చన్నారు. అన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేయవచ్చన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 12:45 AM