పాడిరైతులకు బిల్లులు చెల్లించాలి
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:37 AM
మదర్ డెయిరీలో పాలు పోస్తున్న తమకు రెండు నెలలుగా బిల్లులు చెల్లించడంలేదని, వెంటనే బిల్లులు చెల్లించాలని మండలంలోని పనకబండ గ్రామానికి చెందిన పాడిరైతులు డిమాండ్ చేశారు.
మోత్కూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మదర్ డెయిరీలో పాలు పోస్తున్న తమకు రెండు నెలలుగా బిల్లులు చెల్లించడంలేదని, వెంటనే బిల్లులు చెల్లించాలని మండలంలోని పనకబండ గ్రామానికి చెందిన పాడిరైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం పనకబండ పాల ఉత్పత్తిదారుల కేంద్రం ఎదుట పాల డబ్బాలతో పాడి రైతులు నిరసన వ్యక్తం చేశారు. 15 రోజులకు ఒకసారి పాల బిల్లు చెల్లించాల్సి ఉండగా రెండు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో యాసంగి సీజన పంట సాగుకు నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ కేంద్రానికి సుమారు రూ.4 లక్షల బిల్లు రావాల్సి ఉందన్నారు. పాడి పశువులకు దాణా కొని తెచ్చుకోలేక పోతున్నామన్నారు. కార్యక్రమంలో పాల సంఘం చైర్మన లోతుకుంట మచ్చగిరి, రైతులు లోతుకుంట అనిల్, బత్తిని మహేష్, పొన్నెబోయిన మచ్చగిరి, అంజయ్య, బత్తిని సుదర్శన, నర్సయ్య, మల్లేష్, నర్సింహ, జయరాములు, శ్రీను పాల్గొన్నారు.
Updated Date - Dec 07 , 2024 | 12:37 AM