బీఆర్‌ఎ్‌సవి దిగజారుడు రాజకీయాలు
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:42 AM
బీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పరిధిలోని ఎంబీ కెనాల్ 14వ కిలో మీటర్ వద్ద గండి పడిన ప్రదేశాన్ని, రెడ్లకుంట మేజర్‌కు పడిన గండి ప్రదేశాన్ని, నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద ఎడమ కాలువకు పడిన గండిన పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రె్‌సను విమర్శించడం తప్ప వారు చేసేదేమీ లేదు
‘కాళేశ్వరం’ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జి విచారణ కొనసాగుతుంది
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్, సెప్టెంబరు 15: బీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పరిధిలోని ఎంబీ కెనాల్ 14వ కిలో మీటర్ వద్ద గండి పడిన ప్రదేశాన్ని, రెడ్లకుంట మేజర్‌కు పడిన గండి ప్రదేశాన్ని, నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద ఎడమ కాలువకు పడిన గండిన పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల సహాయం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, పంట నష్ట పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బృందం పరిశీలకు వచ్చి పోయారని, నేటికీ పరిహారం అందించలేదన్నారు. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి మరమ్మతులు, కాల్వలకు పడిన గండ్లను పూడుస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు బుర ద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దిగజారిన రాజకీయాల గురించి మాట్లాడాల్సిన పనిలేదని కేటీఆర్, హరీ్‌షరావు, ఆ పార్టీ నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో 773 చోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ల హయాంలోనే కట్టి వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జి విచారణ చేస్తున్నారని, నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుందన్నారు. నెట్టెంపాడు, సీతారామ ప్రాజెక్ట్, దేవాదుల కల్వకుర్తి వంటి అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామన్నారు. లక్షకోట్లతో కట్టిన కాళేశ్వరం నిధులు గోదావరిలో పారేసినట్లయిందన్నారు. నీటి పారుదలకు సీఎం అవసరమైన నిధులు కేటాయించారని, త్వరలోనే పనులు పూర్తి చేసి రైతులకు వారంరోజుల్లో నీళ్ళు అందించి పంటలు కాపాడతామన్నారు. ప్రతీ ఎకరాన్ని కాపాడుకుంటామన్నారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, విపక్షాల మాటలు పట్టించుకోవద్దన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పరిధిలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌కు పడిన గండిన పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజ్‌సనందాలాల్, నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్నగౌడ్, ఈడ్పుగంటి సుబ్బారావు, దొంగరి వెంకటేశ్వర్లు, గూడెపు శ్రీనివాసు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, దొంగరి సత్యనారాయణ, అరుణ్‌కుమార్, శ్రీనివా్‌సరెడ్డి, గెల్లి రవి, సంపత్‌రెడ్డి, దొంతగాని శ్రీనివా్‌సగౌడ్, కుందూరు శ్రీనివా్‌సరెడ్డి, గోపిరెడ్డి, గొట్టెముక్కల నిర్మల పాల్గొన్నారు.
వారంలోగా గండ్లు పూడ్చుతాం
నడిగూడెం: రేయింబవళ్లు కష్టపడి... వారంలో గా గండ్లు పూడ్చుతామని ఎన్సెస్పీ అధికారులు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా నడిగూ డెం మండలం కాగితరామచంద్రాపూరం వద్ద సాగర్ ఎడమ కాల్వపై పడిన రెండు గండ్ల పూ డ్చివేత మరమ్మతు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. నీటివిడుదల త్వరగా చేస్తేనే పంటలు చేతికి వస్తాయని రైతులు మంత్రి దృష్టికితీళ్లగా గండ్ల పూడ్చివేతపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎన్నెస్పీ సీఈ రమేష్ బాబులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండుచోట్ల పడిన గండ్లను పూడ్చాలంటే నెల రోజులు పడుతుందని, అయితే రాత్రిబంవళ్లు పనిచేసైనా వా రంలోగా గండ్లు పూడ్చి సాగర్ జలాలు రైతులకు అందిస్తామన్నారు. దీంతో రైతుల పొలాలకు పం ట నష్టం జరగకుండా వేగంగా మర్మతులు పూర్తిచేసి రైతులను ఆదుకుంటామన్నారు. గండ్లు పడి న వెంటనే ప్రతిపాదనలు రూపొందించి అంచనా లు సిద్ధం చేసి నిధులు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. స్పాట్ టెండర్‌ను దక్కించుకున్న సంస్థకూడా వేగంగా మరమ్మతు పనులు చేపడుతుందన్నారు. నష్టం అంచనాపై కేంద్ర బృందం పరిశీలించగా వారికి అత్యవసర స్థితిని వివరించామని, వారిచ్చే నివేదిక ద్వారా నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. కాల్వలు, చెరువులు గండ్లు పడటం, ఇళ్లకు నష్టం జరగడం, పంటపొలాలు మునగడం బాధాకరమని, బాధితులందరికీ ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామన్నారు. పాలేరు బ్యాక్‌వాటర్ ద్వారా గండ్లు పడి నష్టం వాటిల్లిందని, ప్రకృతి వైపత్యాని కి ఎవరూ నష్టపోకుండా సీఎం రెవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క సహకారంతో వేగంగా పనులు చేయించేందుకు ఇరిగేషన్ అధికారులకు తగు సూచన లు చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సీఈ రమే్‌షబాబు, ఈఈ రాం కిషోర్, రఘు, తహసీల్దార్ సరిత, ఇమామ్, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాలొన్నారు.
Updated Date - Sep 16 , 2024 | 12:42 AM