కులగణనను పక్కదారి పట్టిస్తున్నారు
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:48 AM
రాష్ట్రంలో కులగణనను నిర్వహించి బీసీల రిజర్వేషన్‌ను పెంచకుండా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ ఆరోపించారు. ఆదివారం నల్లగొం డ జిల్లా నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
నార్కట్‌పల్లి, సెప్టెంబరు 15: రాష్ట్రంలో కులగణనను నిర్వహించి బీసీల రిజర్వేషన్‌ను పెంచకుండా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ ఆరోపించారు. ఆదివారం నల్లగొం డ జిల్లా నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయస్థాయిలో బీసీల రిజర్వేషన్ కోసం కులగణన అవసరమని రాహుల్‌గాంధీ చెబుతుంటే ఇక్కడి సీఎం మాత్రం రాహుల్ మాట వినడం లేదని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ పెంపునకు బీసీల జనాభాను నిర్ధారించే కులగణనే ప్రామాణికమని హైకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చిందన్నారు. ప్రభుత్వం కూడా కులగణనకు తాము సిద్ధమేనని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ద్వారా కోర్టుకు చెప్పిన విషయాన్ని జాజుల గుర్తుచేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కులగణన కోసం షెడ్యూల్, రూట్‌మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీల రిజర్వేషన్ల కులగణన కోసం ఇప్పటివరకు వీధి పోరాటాలు, న్యాయ పోరాటాలు చేశామని, అయినా బీసీలపట్ల సానుకూలత రాకుంటే ధర్మపోరాటం చేస్తామన్నారు. ఇప్పటికైనా బీసీలు బానిసత్వాన్ని వీడి పోరాడితే నాయకులవుతారని, లేకుంటే కార్యకర్త కన్నా హీనమవుతారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను పెంచాలనే డిమాండ్‌తో ఈ నెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సుందరయ్య భవన్‌నుంచి ఇందిరాపార్కు వరకు వేలాది మందితో కులగణన మార్చ్ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింహ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లిఖార్జున్‌యాదవ్, మండల శాఖ అధ్యక్షుడు ముద్దం నర్సింహగౌడ్, విజయ్ పాల్గొన్నారు.
Updated Date - Sep 16 , 2024 | 12:48 AM