సుప్రీకోర్టు మార్గదర్శకాల ప్రకారం వర్గీకరణ చేపట్టాలి
ABN, Publish Date - Nov 23 , 2024 | 11:55 PM
సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించి వర్గీకరణ చేపట్టాలని బెల్లంపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు జి.వినోద్, కేఆర్.నాగరాజు స్పష్టం చేశారు.
నల్లగొండటౌన, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించి వర్గీకరణ చేపట్టాలని బెల్లంపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు జి.వినోద్, కేఆర్.నాగరాజు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబరు 1వ తేదీన హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాలల సింహగర్జన సభకు సన్నాహకంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. మాలల సింహగర్జన బహిరంగ సభ ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, మాలల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం ఐక్యం చేసేందుకే సభ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 30 లక్షల మంది మాలలు ఈ సభకు తరలివచ్చి హైదరాబాద్ నగరాన్ని నీలిమయంగా మార్చాలని పిలుపునిచ్చారు. మాలలపై ఏ పార్టీ కుట్ర చేసినా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర చైర్మన జి.చెన్నయ్య, కోచైర్మన్లు తాళ్లపల్లి రవి, మేక వెంకన్న, బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ చేపట్టిన సభకు మాలలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ కుట్రను తిప్పికొట్టాలని అన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ కుట్ర చేసి మాలలపై కొంతమంది మాదిగ నాయకులతో విషం కక్కిస్తోందని ఆరోపించారు. దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని భాస్కర్ టాకీస్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఓపెన టాప్ జీపులో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన లకుమల్ల మధుబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమ్మేళనంలో నాయకులు మంత్రి నర్సింహయ్య, చెన్నకేశవులు, నాను, గాజుల పున్నమ్మ, చింతపల్లి బాలకృష్ణ, అద్దంకి రవీందర్, సంద యాదగిరి, నామ చక్రవర్తి, అంగారాజు స్వర్ణలత, గీత, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 23 , 2024 | 11:55 PM