రెండు లక్షల విత్తనాల సేకరణ
ABN, Publish Date - Nov 04 , 2024 | 12:31 AM
వనజీవి రామయ్య స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టి ఆదర్శనంగా నిలుస్తున్నాడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ యువకుడు అవిరెండ్ల సందీ్‌పకుమార్.
గ్రీనక్లైమెట్ ఎన్జీవోకు సరఫరా
ఆదర్శంగా నిలుస్తున్న సందీ్‌పకుమార్
మిర్యాలగూడ టౌన, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : వనజీవి రామయ్య స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టి ఆదర్శనంగా నిలుస్తున్నాడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ యువకుడు అవిరెండ్ల సందీ్‌పకుమార్. భూతాపం నుంచి ఉపశమనం పొందాలంటే మొక్కలు నాటి సంరక్షించాలని తలంచి మిత్రబృందంతో వేసవిలో లక్ష విత్తనాల సేకరణకు నాంది పలికిన సందీప్ జూలై మాసాంతానికి తన లక్ష్యాన్ని పూర్తి చేశాడు. పట్టణానికి చెందిన గాంధీనగర్ యూత, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులతో కలిసి వేప, గానుగ, మామిడి, సీతాఫలం, సపోట, అల్లనేరేడు, ఫిస్టులా, పొగడ, చింత, సుబాబు, క్యాషియో తదితర విత్తనాలను విత్తనాలను సేకరించి నియోజకవర్గవ్యాప్తంగా ఆ విత్తనాలను చల్లాడు. ఆగస్టు మాసంలో మరో లక్ష విత్తనాలను సేకరించాలన్న లక్ష్యం పెట్టుకుని ఆదివారం నాటికి పూర్తి చేశాడు. రోజు వారీ దినచర్యలో విత్తనాల సేకరణను భాగస్వామ్యం చేసుకున్న సందీప్ చల్లిన విత్తనాలు మొలకెత్తేందుకు, మొక్కలు పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన పర్యావరణ వేత్త, గ్రీన క్లైమెట్ ఎన్జీవో నిర్వాహకులు జేవీరత్నం నేవీ హెలికాప్టర్ ద్వారా అడవి, ఖాళా ప్రదేశాల్లో సీడ్ బాల్స్ విసురుతుండగా విత్తనాలు సేకరించి సదరు సంస్థకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపాడు. విత్తన సేకరణ కార్యక్రమంలో దైద శ్రీనివాస్, కత్తుల అవినాష్, కందికంటి రాజా, షేక్ రూహిత, దైద పవన, కంటికంటి రాజా, కొత్తపల్లి మణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 04 , 2024 | 12:31 AM