తుది దశకు సమగ్ర సర్వే
ABN, Publish Date - Dec 17 , 2024 | 01:04 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇం టింటా సమగ్ర సర్వే తుది దశకు చేరుకుంది. జిల్లాకు సంబంధించిన సమగ్ర నివేదికు ప్రభుత్వానికి నివేదించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 99.76శాతం మేరకు సర్వే పూర్తి చేశారు.
జిల్లాలో 99.76శాతం పూర్తి
మొత్తం 2,59,921కుటుంబాలు
0.24శాతం మేరకు ఇతర ప్రాంతాల్లో నమోదు
త్వరలో ప్రభుత్వానికి సమగ్రంగా నివేదిక8 సన్నాహాలు చేస్తున్న యంత్రాంగం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇం టింటా సమగ్ర సర్వే తుది దశకు చేరుకుంది. జిల్లాకు సంబంధించిన సమగ్ర నివేదికు ప్రభుత్వానికి నివేదించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 99.76శాతం మేరకు సర్వే పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 99.26శాతం, మునిసిపాలిటీల్లో 102.10శాతం మేర సర్వే పూర్తయింది.
గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలు జిల్లా కేంద్రం భువనగిరితోపాటు పలు మునిసిపల్ కేంద్రాల్లో ఇంటిని నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వారంతా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లోనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నమోదు చేయించుకున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల సంఖ్య పెరగ్గా, గ్రామీణంలో తగ్గిందని అధికారుల అంచనా వే శారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం, ఆ తరువాత 2024వరకు పెరిగిన కుటుంబాలను అంచనా వే సుకొని అధికారులు మొత్తం 2,47,354 కుటుంబాలు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఇళ్లకు స్టిక్కర్లు వేసే క్రమంలో జిల్లాలో మొత్తం 2,60,559 మంది కుటుంబా లు ఉన్నట్టు తేలింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 11,617 కుటుంబాలు పెరిగాయి. ఇదిలా ఉండ గా, ఇప్పటి వరకు 2,59,921 కుటుంబాల సర్వే పూర్తయింది. మిగతా ఇళ్లకు స్టిక్కర్లు వేసినా, పలువురు రెం డుచోట్ల నివాసం ఉండటం తో ఒక్క చోట సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారు.దీంతో పట్టణాల్లో కు టుంబాల సంఖ్య పెరిగింది.
దాదాపు పూర్తయిన సర్వే
జిల్లాలో దాదాపు సర్వే పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తు త జనాభా ప్రకారం 1,800 బ్లాక్‌లు ఏర్పాటుచేశారు. నవంబరు 9వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నిర్వహించారు. జనగణన మాదిరిగానే 150 ఇళ్లను ఒక ఎన్యూమరేష న్ బ్లాక్‌గా తీసుకున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు 10 ఇళ్ల చొప్పు న 15 రోజుల్లో 150ఇళ్లను సర్వే పూర్తి చేశారు. కుటుంబాల సంఖ్య పెరిగినందున ఎన్యూమరేషన్ బ్లాక్‌లో 250 ఇళ్లు ఉంటే మొద టి 150 ఇళ్లకు ఒకరు, మిగతా 100 ఇళ్లకు ఇంకో ఎన్యూమరేటర్‌ను నియమించారు. వాటిని ఏ, బీ బ్యాక్‌లుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఇళ్లకు స్టిక్కర్లు అంటించగా, చాలా మంది సర్వేలో వివరాల నమోదుకు ముందుకు రాలేదు. దీంతో ఎన్యూమరేటర్లు మరోసారి ఇంటింటికీ తిరిగి విచారణ నిర్వహించారు. అయితే చాలా మంది హైదరాబాద్ నగరంలోనే వివరాలు నమోదు చేసుకున్నట్టు గుర్తించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన కుటుంబాలు 0.24శాతం మేర జీహెచ్‌ఎంసీ పరిధిలో వివరాలు నమోదు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేతో కుటుంబాలు, జనాభా లెక్కలతో పాటు సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలియనున్నాయి.
కులాల వారీగా తేలనున్న లెక్క
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివస్తున్న ప్రజలకు సంబంధించిన సరైన వివరాలు లేకపోవడంతో అర్హులు ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సర్వేతో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాల లెక్కలు తేలనున్నాయి. సర్వేలో ప్రధానంగా ప్రతీ కుటుంబానికి సంబంధించిన కుల వివరాలు పొందుపరిచారు. దీంతో బీసీ జనాభా లెక్కలు తేలనుండగా, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంతేగాక సర్వేతో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందజేయడం ప్రభుత్వానికి సులువుకానుంది. జిల్లాలో మొత్తం 17 మండలాలు, 426 గ్రామపంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో కేటాయించిన రిజర్వేషన్లలో మార్పులు చేపట్టి, ప్రభుత్వం నిర్వహించిన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం లేకపోలేదని రాజకీయంగా చర్చ సాగుతోంది.
ఆన్‌లైన్ అప్‌డేషన్ పూర్తి చేస్తున్నాం: కె.గంగాధర్, అదనపు కలెక్టర్
జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆన్‌లైన్ అప్‌డేషన్ పూర్తి చేస్తున్నాం. సర్వే తుది దశకు చేరుకుంది. జిల్లాలో 99.76శాతం సర్వే పూర్తయింది. ఇంకా వివరాలు నమోదు చేయించుకోని వారు ఉంటే వారికి సమాచారం అందిస్తున్నాం. వారి వద్దకు అధికారులు రాని పక్షంలో స్థానిక పంచాయతీ, ఎంపీడీవో కార్యాలయాల్లో సంప్రదించాలి. 100శాతం సర్వే పూర్తి చేసేందుకు సహకరించాలి. జిల్లాలోని 17 మండలాలకు ప్రతీ మండలానికి ఎంపీడీవోను నోడల్ అధికారిగా, ప్రతీ మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించాం. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలకు కమిషనర్లను నోడల్ అధికారిగా నియమించాం. వివరాలు నేటికీ నమోదుచేసుకోని వారు వీరిని సంప్రదించాలి.
Updated Date - Dec 17 , 2024 | 01:04 AM