ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మిల్లర్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కు

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:30 AM

మిల్లర్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. స్థానిక వ్యవసా య మార్కెట్‌ యార్డులోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను ఆయన సోమవారం పరిశీలించారు.

రాజ్యసభ సభుడు కె.లక్ష్మణ్‌

చౌటుప్పల్‌ టౌన్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యో తి): మిల్లర్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. స్థానిక వ్యవసా య మార్కెట్‌ యార్డులోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను ఆయన సోమవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రైతులు ఎం త ప్రాధేయపడుతున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, పుల్లారెడ్డి అనే రైతు 35 రోజులుగా తూకాల కోసం ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. కొనుగో లు కేంద్రాల్లో తూకం వేసి ఎగుమతి చేసిన ధా న్యాన్ని మిల్లర్లు తిప్పి పంపడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో 93లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు రూ.27వేల కోట్లను ఖర్చు చేస్తోందని అన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రతీ పైసా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని, కేవలం తూకం వేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపడం బాధాకరమన్నారు. అన్ని రకాల ధాన్యానికి రూ. 500 బోనస్‌ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్‌ నేడు సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని ఆయన అన్నారు. సమావేశంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనూరు వీరారెడ్డి, నాయకులు దూడల భిక్షంగౌడ్‌, రమనగోని శంకర్‌, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, పి.శ్రీధర్‌బాబు, కంది లక్ష్మారెడ్డి, డి.భిక్షమాచారి, ముత్యాల భూపాల్‌రెడ్డి, పక్కీర్‌ శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

35 రోజులుగా తూకాలు వేయడం లేదు

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 35 రోజులుగా ప్రాధేయపడుతున్నా తూకాలు వేయడం లేదని రైతు చింతపల్లి పుల్లారెడ్డి రాజ్యసభ సభ్యు డు కె.లక్ష్మణ్‌కు మొరపెట్టుకున్నాడు. 1,100 బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చానని, రెండుసార్లు కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రూ.30వేల ఖర్చు వచ్చిందని, రూ.1,000 లంచం ఇచ్చిన వ్యక్తుల ధాన్యం తేమశాతం రాకున్న తూకాలు వేయిస్తున్నారని వివరించాడు.

(ఆంధ్రజ్యోతి, చౌటుప్పల్‌ రూరల్‌): కే.లక్ష్మణ్‌ మండల పరిధిలోని జైకేసారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో శేఖర్‌రెడ్డితో కలిసి సందర్శించి రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు.

లంచం ఇస్తేగాని తేమ చూడరా

రైతులు లంచం ఇస్తేగాని తేమ చూడరా అ ని ఏఈవో కృష, పీఏసీఎస్‌ సెక్రటరీ వై.రమే్‌ష పై లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్లారెడ్డికి చెందిన ధాన్యం తేమ శాతం పరిశీలించగా 15.8 రావడంతో అధికారులను లక్ష్మణ్‌ నిలదీశారు. పుల్లారెడ్డి ధాన్యానికి వెంటనే తూకం వేయించాలని, ఆ తరువాతే తాను ఇక్కడి నుం చి వెళ్తానని భీష్మించారు. దీంతో అధికారులు ధాన్యాన్ని తూకం వేయించారు. కలెక్టర్‌కు ఫోన్‌ చేసి తూకాల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, చౌటుప్పల్‌ ప్రాంతం నుంచి వెళ్తున్న ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని కోరుతూ లక్ష్మణ్‌కు పీఏసీఎస్‌ చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Nov 12 , 2024 | 12:30 AM