ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గీతకార్మికులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:09 AM

గీతకార్మికులకు కాం గ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం నియోజకవర్గంలోని 200 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం మోకులను స్థాని క ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గీత వృత్తికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తోందన్నారు.

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

ఆలేరు రూరల్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): గీతకార్మికులకు కాం గ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం నియోజకవర్గంలోని 200 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం మోకులను స్థాని క ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గీత వృత్తికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తోందన్నారు.కల్లును శీతల పానీయంగా ప్రభుత్వం గుర్తించనుందని,కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వా రి భద్రతకోసం ప్రత్యేకంగా కిట్లను అందిస్తోందన్నారు. ఈ కిట్ల పంపి ణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ భూముల్లో ఈత, తాటి చెట్లను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని, 50 ఏళ్లు దాటిన గీత కార్మికులందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షోలామ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఐనాల చైతన్యరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, ఎక్సైజ్‌ సీఐ దీప్తి, నిరోశ, రమేష్‌, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం లో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో 370 ధాన్యం కేంద్రా లు ఏర్పాటు చేయగా, అందులో సన్న ధాన్యాల కోసం 48 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మద్దతు ధరకు బోన్‌సతో కలిపి క్వింటా రూ.2,720 చెల్లిస్తోందన్నారు. రైతులు ధాన్యాన్ని విక్రయించిన మూడు రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామన్నారు. గత ఏడాది 53,343 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, ఈ ఏడాది 86,110 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. అందుకు 30లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దే విక్రయించాలన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ మదార్‌గౌడ్‌, కౌన్సిలర్లు గుత్త శమంతారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్‌, చిలుకు కిష్టయ్య, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్‌, సురే్‌షగౌడ్‌, ఎజాస్‌, వెంకటేశ్వర్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 01:09 AM