కాంగ్రె్‌సతోనే నేతన్నల సమస్యలకు పరిష్కారం
ABN, Publish Date - Dec 06 , 2024 | 12:40 AM
రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పరిష్కారమవుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పరిష్కారమవుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం భూదాన్‌పోచంపల్లి పర్యటించిన ఎమ్మెల్యే ముందుగా రేవణపల్లిలో దివీస్ ల్యాబరేటరీస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ప్రజాపాలన విజయోల్సవాల్లో భాగంగా చేనేత జౌళీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిపై నిర్వహించిన చేనేత ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేనేతకు చేయూత పథకం కింద భువనగిరి నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికులకు మంజూరు చేసిన రూ.34,11,06,200 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన దమ్మున్న సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. అంతకుముందు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మునిసిపల్ సిబ్బందికి హెల్త్‌క్యాం్‌పలు, పారిశుద్ధ్య సిబ్బందికి దుస్తులు, శానిటేషన్ కిట్స్‌తోపాటు మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మునిసిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీ, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామియాదవ్, చేనేత జౌళీశాఖ ఆర్‌డీడీ పద్మ, డిప్యుటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏడీ కామల్, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయక్, తహసీల్దారు మహేందర్‌రెడ్డి, మండల వైద్యాధికారి శ్రీవాణి, జిల్లా చేనేత నాయకులు తడక వెంకటేష్, టైఅండ్‌డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, పోచంపల్లి అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేష్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, కౌన్సిలర్లు బోగ భానుమతి విష్ణు, మోటె రజిత రాజు, ఎంఈవె ప్రభాకర్, ఏవో శైలజ, బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుడికాల సుజన, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్‌రెడ్డి, రాపోలు శ్రీనివాస్ పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే అభినందన
భువనగిరి రూరల్, బీబీనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా యూత్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలం చీమలకొండూరు గ్రామానికి చెందిన మంగ ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ప్రవీణ్ గురువారం ఎమ్మెల్యే కుంభంను కలిసి శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందచేశారు. తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గం అధ్యక్షుడిగా గెలుపొందిన బీబీనగర్ మండలానికి చెందిన బద్దం వాసుదేవరెడ్డి, మండల అధ్యక్షుడిగా గెలుపొందిన కొలను నిఖిల్‌రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Dec 06 , 2024 | 12:40 AM