ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూసీకి కొనసాగుతున్న వరద

ABN, Publish Date - Nov 04 , 2024 | 12:32 AM

మండల కేంద్రం సమీపంలోని మూసీ వాగులో మూడు నెలల నుంచి ప్రవాహం ఆగడంలేదు.

జాజిరెడ్డిగూడెం-వంగమర్తి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న మూసీ వాగు

అర్వపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం సమీపంలోని మూసీ వాగులో మూడు నెలల నుంచి ప్రవాహం ఆగడంలేదు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో వర్షం కురవడంతో మూసీ వాగుకు ప్రవాహం ఎక్కువైంది. మూసీ పరివాహక ప్రాంతంలో వరద పర్చుకొని వస్తుండడంతో జాజిరెడ్డిగూడెం-వంగమర్తి గ్రామాల బ్రిడ్జిపై వెళ్లే ప్రయాణికులు సెల్పీలు దిగి వెళ్తున్నారు. మూడు నెలలుగా ప్రవాహం తగ్గకపోవడంతో మూసీ వెనక భాగం మొత్తం నీటితో మునిగిపోయిఉంది. మూసీ వాగు నుంచి రైతులు మోటార్లు తీయడానికి దిగరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పదేళ్ల నుంచి లేనివిధంగా మూసీ వాగు ప్రవాహిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా వస్తున్న వరదతో స్థానికంగా భూగర్భ జలాలు పెరిగాయి.

Updated Date - Nov 04 , 2024 | 12:32 AM