కూ.. చుక్‌చుక్
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:02 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా మరో రెండు రైలుమార్గాలు ఏర్పాటుకానున్నాయి. ఇందులో సెమీహైస్పీడ్ కారిడార్ ఏర్పాటు దిశగా ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది.
శంషాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా సెమీహైస్పీడ్ కారిడార్
సూర్యాపేట, నల్లగొండ మీదుగా కర్నూల్‌కు...్ల
ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా మరో రెండు రైలుమార్గాలు ఏర్పాటుకానున్నాయి. ఇందులో సెమీహైస్పీడ్ కారిడార్ ఏర్పాటు దిశగా ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది. ఈ రైల్వేమార్గం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి సూర్యాపేట మీదుగా నాగర్ కర్నూలు నుంచి కర్నూలు వరకు మరో రైలుమార్గం సర్వే పనులు పూర్తికావచ్చాయి. ఆయా రైలు మార్గాల ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే కొన్నేళ్లుగా సూర్యాపేట ప్రజల డిమాండ్ అయిన రైల్వేమార్గం కల సాకారం కానుంది. అదే సమయంలో నల్లగొండ జిల్లాలో ఇప్పుడున్న బీబీనగర్-గుంటూరు మార్గానికి తోడు మరో రెండు మార్గాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట టౌన)
హైదరాబాద్-విశాఖపట్నం మధ్య సెమీహైస్పీడ్ రైల్వేమార్గం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. అయితే సికింద్రాబాద్ నుంచి కాకుండా శంషాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వరకు నాలుగు గంటల వ్యవధిలో చేరుకునేలా ఈ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా సూర్యాపేట పట్టణం మీదుగా వెళుతూ ఆ ప్రాంత ప్రజల ఆశలు నెరవేరేలా ఈ కారిడార్ ఉండనుంది. దీనికితోడు మరోమార్గం విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు వెళ్లే రైలుమార్గం సూర్యాపేట మీదుగా వెళ్లేలా ప్రతిపాదనలు రూపొందించారు. ముఖ్యంగా విశాఖలో మొదలై సూర్యాపేట నుంచి నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు మీదుగా కర్నూలు చేరుకుంటుంది. దీనిలో భాగంగా ప్రిలిమినరీ ఇంజనీరింగ్, ట్రాఫిక్(పెట్) సర్వే ఇప్పటికే పూర్తిచేయడంతో పాటు ఈ నెలలో నివేదికను రైల్వేబోర్డుకు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
గంటకు 220 కిలోమీటర్ల వేగంతో...
శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు విజయవాడ మీదుగా సూర్యాపేటను కలుపుకుంటూ సెమీ హైస్పీడ్ రైల్‌కారిడార్ ఎలైనమెంట్ ఖరారైంది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. మొదటిది వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ మార్గం కాగా, మరొకటి నల్లగొండ నుంచి గంటూరు మీదుగా విజయవాడ మార్గాలు ఉన్నాయి. ఆయా మార్గాల్లో రైలు గరిష్టవేగం (5వ పేజీ తరువాయి)
గంటకు 110-130 కిలోమీటరు మాత్రమే కాగా ప్రస్తుతం సూర్యాపేట మీదుగా వెళ్లే రైలుమార్గంలో గంటకు 220 కిలోమీటరు వేగంతో ప్రయాణం ఉండనుంది. దీంతో ఇప్పటికే నడుస్తున్న రైలుమార్గాల్లో 12 గంటల సమయం పడుతుండగా నూతన మార్గంలో కేవలం నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చు. దీంతో ప్రయాణం సులభతరం కానుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమెదటి హైస్పీడ్ కారిడార్ ఇదే కావడం గమనర్హం.
సెమీహైస్పీడ్ కారిడార్ ప్రతిపాదిత మార్గం
నాలుగు గంటల్లో శంషాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకునేలా సెమీహైస్పీడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గం శంషాబాద్ నుంచి నల్లగొండ జిల్లా గట్టుప్పుల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్ నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రం మీదుగా కోదాడను కలుపుతూ ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని జగ్గయ్యపేట, విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరనుంది.
తీరనున్న ‘పేట’ ప్రజల కల
తమ ప్రాంతం మీదుగా రైలు ప్రయాణం ఉండాలన్న సూర్యాపేట ప్రజల ఎదురుచూపులకు తెరపడనుంది. సూర్యాపేట మీదుగా రెండు రూట్లలో సర్వే చేపడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎంపీగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు రైల్వేలైన కోసం వినతిపత్రాలు అందజేయడంతో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినని కలిసి వివరించారు. అదేవిధంగా గతంలో మాజీమంత్రి జగదీ్‌షరెడ్డి పలుమార్లు కేంద్రానికి వినతిపత్రాలు అందజేశారు.
మరోమార్గం
విశాఖపట్నం నుంచి విజయవాడ, జగ్గయ్యపేట, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల మీదుగా కర్నూల్ వరకు రైల్వేమార్గం ఏర్పాటుకు సర్వే పూర్తయ్యింది. ఈపూర్తి రైల్వే కారిడార్‌కు రూ.2వేల కోట్ల వరకు బడ్జెట్‌కు ఆమోదం తెలపాల్సి ఉంది.
సూర్యాపేట ప్రజలకు ఎంతో మేలు
ప్రతిపాదనల్లో ఉన్న రెండు మార్గాలతో సూర్యాపేట ప్రజలకు ఎంతో మేలు జరుగనుంది. ముఖ్యంగా సూర్యాపేట ప్రజలు నిత్యం విజయవాడకు దర్శనాలకు, వ్యాపారం నిమిత్తం వెళ్తుంటారు. అంతేకాకుండా రైతులకు కొంతమేలు జరిగే అవకాశం ఉంది. రైతులకు సంబంధించిన ట్రాక్టర్ స్పేర్‌పాట్స్ కోసం నిత్యం విజయవాడకు వెళ్తుంటారు. ఇక్కడి నుంచి నిత్యం విజయవాడకు రాకపోకలు ఉండటంతో ప్రైవేట్ బస్సులు 10 వరకు నడుస్తుంటాయి. త్వరలో రైల్‌మార్గం వస్తే వీరి కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట ప్రజలు రైలు మార్గంలో వెళ్లాలంటే సుమారు 35 కిలోమీటర్లకు పైగా దూరం ఉండే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన, 46 కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లగొండ రైల్వేస్టేషనకు, 62 కిలోమీటర్ల దూరం ఉండే ఖమ్మం రైల్వేస్టేషన్లను ఆశ్రయిస్తుంటారు. రైల్వేలైన ఏర్పాటుతో ఆ కష్టాలు తీరనున్నాయి. సూర్యాపేట జిల్లా ప్రజలు మహబూబ్‌నగర్ ప్రాంతానికి వెళ్లాలంటే హైదరాబాద్‌కు వెళ్లి వెళ్లాల్సి వస్తోంది. విశాఖపట్నం నుంచి కర్నూల్ మార్గం వయా సూర్యాపేటకు మీదుగా రైల్వేమార్గంతో చుట్టూ తిరిగే వెళ్లే కష్టాలకు చెక్‌పడనుంది.
గతంలోనూ..
గతంలో సూర్యాపేట మీదుగా బుల్లెట్ రైల్ ప్రతిపాదన ఉన్నా, కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు సెమీహైస్పీడ్ కారిడార్ కూడా సర్వేతో నిలిచిపోవద్దని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా గతంలో డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్తరైల్వేలైనకు(ఎ్‌ఫఎల్‌ఎ్‌స) సర్వేను గతంలో చేయగా రైల్వేబోర్డు గతంలోనే ఆమోదం తెలిపింది. దీనికి కోసం నిధులు సైతం మంజూరు చేశారు. అయినప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఈసారి ప్రతిపాదనల్లోని రైలుమార్గాలు కార్యరూపం దాల్చలని కోరుతున్నారు.
Updated Date - Nov 17 , 2024 | 01:02 AM