ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధర్మవనంలో కుళ్లిన మృతదేహం

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:51 AM

యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని ధర్మవనం ప్రాజెక్ట్‌లో బుధవారం కుళ్లిన మృతదేహం ఎముకల గూడు రూపకంలో లభ్యమైందని పట్టణ ఇన్సపెక్టర్‌ కె.సురే్‌షకుమార్‌ తెలిపారు.

భువనగిరి టౌన, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని ధర్మవనం ప్రాజెక్ట్‌లో బుధవారం కుళ్లిన మృతదేహం ఎముకల గూడు రూపకంలో లభ్యమైందని పట్టణ ఇన్సపెక్టర్‌ కె.సురే్‌షకుమార్‌ తెలిపారు. ఇన్సపెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవనం ప్రహరీ, ఫెన్సింగ్‌ మధ్యన పెరిగిన గడ్డిని ధర్మవనం సిబ్బంది శుభ్రం చేస్తున్న క్రమంలో ఎముకల గూడు వెలుగు చూసింది. దీంతో ధర్మవనం వాజ్‌మన డి.వేణుగోపాల్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహంపై ఎర్రటి కట్‌ డ్రాయర్‌, ఓ చేతికి రబ్బర్‌ బ్యాండ్‌ ఉన్నాయి. మృతదేహం సుమారు 30 సంవత్సరాల లోపు యువకుడిదిగా, సుమారు రెండు నెలల క్రితం మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. భువనగిరి పరిసరాల్లో ఇటీవల ఎవరైనా తప్పిపోయినా, ఆచూకీ లేని వివరాలను పట్టణ పోలీస్‌ స్టేషనలో తెలుపాలని సూ చించారు. 8712662471, 8712579985కి సంప్రదించాలని అన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:51 AM