ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత పనులకు అవాంతరాలు

ABN, Publish Date - Dec 16 , 2024 | 12:26 AM

భువనగిరి పట్టణ రహదారి 100 ఫీట్ల విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన విద్యుత టవర్లకు తీగల బిగింపు, ట్రాన్సఫార్మర్ల ఏర్పాటు పనులకు అవాంతరాలు తలెత్తుతున్నాయి.

కోర్టుకు వెళ్లిన ఓ స్కూల్‌ యాజమాన్యం

ట్రాన్సఫార్మర్ల ఏర్పాటుపై అభ్యంతరాలు

వివాదాలను పరిష్కరించి పనులు పూర్తి చేస్తామంటున్న ట్రాన్సకో అధికారులు

భువనగిరి టౌన, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): భువనగిరి పట్టణ రహదారి 100 ఫీట్ల విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన విద్యుత టవర్లకు తీగల బిగింపు, ట్రాన్సఫార్మర్ల ఏర్పాటు పనులకు అవాంతరాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ పాటికే పనులు పూర్తయి వినియోగంలోకి రావాల్సి ఉండేది. కానీ పలు అవాంతరాలతో పనుల ప్రారంభం, కొనసాగింపులో విపరీత జాప్యం జరిగింది. ఈ మేరకు సుమారు ఏడాదిగా నడుస్తున్న పనుల్లో తాజాగా తలెత్తిన అవాంతరాలతో పనుల పూర్తికి మరింత ఆలస్యం కానున్నట్లు ప్రచారం అవుతుతోంది. అయితే అవన్నీ తాత్కాలిక అవాంతరాలేనని వాటన్నింటిని అధిగమించి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కోర్టు వివాదాలు, ట్రాన్సఫార్మర్ల ఏర్పాటుకు అభ్యంతరాలు

భువనగిరి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రహదారి సుందరీకరణ, పట్టణంలోని విద్యానగర్‌, తారకరామానగర్‌, ప్రగతి నగర్‌, పహాడీనగర్‌ తదితర బస్తీల్లోని ఇళ్లపై నుంచి వెళ్తున్న 33కేవీ విద్యుతలైన్లను ఆ ప్రాంతాల నుంచి శాశ్వతంగా తొలగించే ప్రధాన రహదారి వెంట మళ్లించే లక్ష్యంతో పట్టణ ప్రధాన రహదారి వెంట బొమ్మాయిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకు ఇరువైపులా 120 టవర్లను ఏర్పాటు చేశారు. కానీ ఇండియా మిషన హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన రెండు టవర్నపై స్కూల్‌ యజమాన్యం కోర్టును ఆశ్రమించడంతో ఆ ప్రాంతంలో పనులకు బ్రేక్‌ పడింది. అలాగే రహదారి వెంట ఇరువైపులా 15 ట్రాన్సఫార్మర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ మేరకు ఇప్పటి వరకు ఏడు ట్రాన్సఫార్మర్‌ దిమ్మెలను పూర్తి చేయగా మరో నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా నాలుగు ట్రాన్సఫార్మర్ల ఏర్పాట్లపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇండియా మిషన స్కూల్‌ ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో 33 కేవీ, 11 కేవీ విద్యుత వైర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ఎల్‌టీ లైన బిగింపు పనులు కూడా పూర్తి చేయనున్నారు. కానీ ఇండియా మిషన స్కూల్‌ కోర్టు వివాదం, నాలుగు ట్రాన్సఫార్మర్ల ఏర్పాటుపై దుకాణా యజమానులు చేస్తున్న అభ్యంతరాలు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. పనుల కొనసాగింపులో తలెత్తుతున్న ఇబ్బందులను ట్రాన్సకో అధికారులు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి వివరించగా సయోద్యగా పరిష్కరిద్దామని ఇందు కోసం సంబంధిత యజమానులతో చర్చిద్దామని పేర్కొన్నట్లు తెలిసింది. ఏదేమైనా వివాదాలను పరిష్కరించి వెంటనే పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పనులను త్వరలో పూర్తి చేస్తాం

విద్యుత టవర్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ఎల్‌టీ వైరు బిగింపు పనులు పూర్తి చేస్తాం. 11 ట్రాన్సఫార్మర్లను కూడా బిగిస్తాం. ఇండిమా మిషన స్కూల్‌, ట్రాన్సఫార్మర్ల బిగింపులో తలెత్తుతున్న అభ్యంతరాలపై ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీంతో త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.

-సాయికృష్ణ, ట్రాన్సకో భువనగిరి టౌన ఏఈ

Updated Date - Dec 16 , 2024 | 12:27 AM