ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పరిహారం రెట్టింపు

ABN, Publish Date - Oct 25 , 2024 | 01:07 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత్‌మాల పరియోజన కింద నిర్మించనున్న రీజనల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పరిహారాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అలైన్‌మెంట్‌ను మార్చాలని రైతులు కొన్నాళ్లుగా ఆందోళనబాట పట్టి, భూసేకరణ సర్వే పనులు, విచారణ సమావేశాలను అడ్డుకుంటూ నిరసన తెలిపారు.

సవరించిన మార్కెట్‌ ధరలతో కేంద్రానికి నివేదిక

గతంలో నిర్ణయించిన ధర కంటే మూడురెట్లు పెరిగే అవకాశం

అలైన్‌మెంట్‌లో ఎలాంటి మార్పు లేదు

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి):కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత్‌మాల పరియోజన కింద నిర్మించనున్న రీజనల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పరిహారాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అలైన్‌మెంట్‌ను మార్చాలని రైతులు కొన్నాళ్లుగా ఆందోళనబాట పట్టి, భూసేకరణ సర్వే పనులు, విచారణ సమావేశాలను అడ్డుకుంటూ నిరసన తెలిపారు. అయితే వీటిని పట్టించుకోకుండా పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే ముందుకు వెళ్లాలని, ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్రిపుల్‌ఆర్‌ నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే 3జీ నోటిఫికేషన్‌ జారీచేసింది. అవార్డు పాస్‌ తుదిదశలో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌తో భూములు, ప్లాట్లు కోల్పోతున్న రైతులకు, యజమానులకు పరిహారం రెట్టింపు స్థాయిలో పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న బాధితులకు పరిహారం మూడురెట్లు అధికం కానుంది. అయితే పరిహారం నిర్ణయంలో భారీ తేడా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోవడంలేదు. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంది. సవరించిన పరిహారాన్ని చెల్లించేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఆర్‌ఆర్‌ఆర్‌పై గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అలైన్‌మెంట్‌కే ప్రస్తుత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అలైన్‌మెంట్‌ను మార్చే ప్రసక్తే లేదని, అవసరమైతే భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ మేరకు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్‌ విలువ, బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ఎలా ఉందో పరిశీలించింది. జిల్లాలో తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల్లో భూములు సేకరించాల్సి ఉంది. తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఎకరానికి రిజిస్ట్రేషన్‌ విలువ రూ.3.37లక్షల నుంచి రూ.6.75లక్షల వరకు ఉంది. భువనగిరి, వలిగొండలో రూ.7.50లక్షల నుంచి రూ.13.50లక్షల వరకు ఉంది. చౌటుప్పల్‌లో రూ.12లక్షల వరకు రిజిస్ట్రేషన్‌ విలువ ఉంది. అయితే బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఎకరానికి ఆయా ప్రాంతాల్లో రూ.కోటి నుంచి రూ.4కోట్లకు పైగా ధర ఉంది. ఇంటి స్థలం గజానికి రూ.800నుంచి రూ.3,500వరకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ధర ఉండగా, బహిరంగ మార్కెట్‌లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.6వేలు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.10నుంచి రూ.15వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.30వేలకు పైగా ఉంది. ప్రభుత్వం తాజాగా, తీసుకున్న నిర్ణయం ప్రకారం సవరించిన పరిహారం తుర్కపల్లి మండలంలో ఎకరాకు రూ.6.85లక్షల నుంచి రూ.11.47లక్షల వరకు పెరగనుంది. భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌లో పరిహారం పెంపుపై అధ్యయనం కొనసాగుతోంది.

అలైన్‌మెంట్‌లో మార్పులు ఉండవు

ప్రస్తుతం ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డుకు 40 నుంచి 50కిలోమీటర్ల దూరం నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు గత ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం దీనికే ఆమోదముద్ర వేసింది. జిల్లాలో ఆర్‌ఆర్‌ఆర్‌కు మొత్తం 1,927ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఉత్తరభాగంలో నిర్మించే ఈ రోడ్డు 158కిలోమీటర్లు ఉంటుంది. జిల్లాతోపాటు, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని 19 మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా ఈ రహదారి నిర్మాణం కానుంది. జిల్లాలో 34 గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుంది. చౌటుప్పల్‌లో 8 గ్రామాలు, వలిగొండలో 9, భువనగిరిలో 9, యాదగిరిగుట్టలో 2, తుర్కపల్లిలో 6 గ్రామల నుంచి ఈ రహదారి వెళ్లనుంది. ఉత్తర భాగంలో ఈ రహదారి 98.989కి.మీ నుంచి 118.188కి.మీ మైలురాయి వరకు మొత్తం 580.17ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.

డివిజన్ల వారీగా సేకరించే భూమి ఇలా..

డివిజన్‌ నుంచి వరకు సేకరించే భూమి

భువనగిరి 118.188కి.మీ 133.178కి.మీ 492

చౌటుప్పల్‌ 133.178కి.మీ 158.64కి.మీ 784.16

దీనికి అదనంగా చౌటుప్పల్‌ వద్ద జంక్షన్ల కోసం 188ఎకరాల భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈరెండు డివిజన్ల పరిధిలో సర్వే పనులు పూర్తికాగా,అవార్డు పాస్‌కోసం విచారణ కొనసాగుతోంది.

Updated Date - Oct 25 , 2024 | 01:07 AM