ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాల అభివృద్ధికి కృషి

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:21 AM

నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.

గుండాల: వెల్మజాల గ్రామంలో వాటర్‌ ప్లాంటును ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

గుండాల, సెప్టెంబరు 15: నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని వెల్మజాల గ్రామంలో ఆదివారం బీర్ల ఫౌండేషన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంటును డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డితో కలిసి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. గ్రామస్థుల కోరిక మేరకు గ్రామంలో వాటర్‌ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు డప్పులు, కోలాటాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం గుండాల మండల కేంద్రంతో పాటు మండలంలోని రామారం, మాసానపల్లి, వెల్మజాల గ్రామాల్లో ఆదివారం వినాయకుడి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండాల, మాసానపల్లి, వెల్మజాలలో వినాయకుడి వద్ద నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అఽధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రాంరెడ్డి, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు షర్పొద్దీన, సీసీ బ్యాంక్‌ చైర్మన లింగాల భిక్షం, మాజీ ఎంపీపీలు ద్యాప కృష్ణారెడ్డి, సంగి వేణుగోపాల్‌, రావుల హరితాదేవి, మాజీ ఆల్డా డైరక్టర్‌ ఇమ్మడి దశరథ, నాయకులు దేవనబోయిన అయలయ్య, ఈరసరపు భిక్షం, మలిపెద్ది మాధవరెడ్డి, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:22 AM

Advertising
Advertising