అలరించిన ‘అలలు లేని సముద్రం’
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:36 AM
మహాత్మాగాంధీ జయంతి, ప్రముఖ విద్యావేత్త దరిపెల్లి అనంతరాములు స్మారకార్థం సోమవారం రాత్రి భువనగిరిలో నిర్వహించిన అలలు లేని సముద్రం నాటక ప్రదర్శన అందరినీ అలరించింది.
భువనగిరి టౌన, అక్టోబరు 1: మహాత్మాగాంధీ జయంతి, ప్రముఖ విద్యావేత్త దరిపెల్లి అనంతరాములు స్మారకార్థం సోమవారం రాత్రి భువనగిరిలో నిర్వహించిన అలలు లేని సముద్రం నాటక ప్రదర్శన అందరినీ అలరించింది. జాతీయ రంగ స్థల నటుడు, అంతర్జాతీయ నాటక అవార్డు గ్రహిత టి.రాములు పర్యవేక్షణలో సామాజిక నేపథ్యంతో ప్రదర్శించిన నాటకంలో కళాకారుల నటనా చాతుర్యం, సంభాషణలు వీక్షకుల్లో ఆసక్తి కల్పించాయి. కనుమరుగవుతున్న నాటక ప్రదర్శనలకు పూర్వ వైభవం కల్పించే లక్ష్యంతోనే నాటక ప్రదర్శనలు ప్రతీ ఏటా నిర్వహిస్తున్నట్లు కృషి ఐటీఐ, సాయికృప కళాశాల చైర్మన దరిపల్లి ప్రవీణ్‌కుమార్ అన్నారు. కళాకారులను ప్రముఖ రచయిత తిరునగరి శ్రీనివాస్ సన్మానించారు.
మూడు ఉద్యోగాలకు ఒకేసారి ఎంపిక
Updated Date - Oct 02 , 2024 | 08:01 AM