చివరి గ్రామానికీ తాగునీరందాలి
ABN, Publish Date - Apr 05 , 2024 | 12:40 AM
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, జిల్లాలోని చివరి గ్రామానికి తాగునీరు అందాలని ప్రత్యేకాధికారి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితారాంచంద్రన ఆదేశించారు.
ప్రత్యేకాధికారి అనితారాంచంద్రన
సూర్యాపేట(కలెక్టరేట్)/ మునగాల రూరల్, ఏప్రిల్ 4 : వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, జిల్లాలోని చివరి గ్రామానికి తాగునీరు అందాలని ప్రత్యేకాధికారి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితారాంచంద్రన ఆదేశించారు. తాగునీటి ఎద్దడి నివారణ చర్యలపై కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ వెంకటరావుతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ఎక్కడా మూడు నెలల పాటు నీటిఎద్దడి రాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని నీటినిల్వలు, లభ్యత, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన చేతిపంపులు, బావులు, పంపుసెట్లు మిగిలిన వాటిని వెంటనే అందుబాటులోకి తేవాలన్నారు. కలెక్టర్ వెంకటరావు మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటికే పటిష్ఠమైన చర్యలు చేపట్టామన్నారు. రూరల్ ప్రాంతాల్లో ఎస్‌డీఎఫ్ కింద రూ.363.5లక్షలతో చేపట్టిన 184 పనుల్లో 151 పూర్తి కాగా మిగిలిన 33 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అదేవిధంగా మునిసిపాలిటీల్లో 15 ఫైనాన్స, డీఎంఎ్‌ఫటీ కింద చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీహెచ ప్రియాంక, మిషన భగీరథ ఎస్‌సీ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్‌డీవో మధుసూదనరాజు, ఆర్డీవో వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసరావు, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మునగాల మండలంలోని మాధవరం పంచాయతీ పరిధిలోని నర్సరీ, పంప్‌హౌస్ మరమ్మతులను కలెక్టర్ వెంకటరావుతో కలిసి గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితారాంచంద్రన పరిశీలించారు. వారి వెంట అదనపు కలెక్టర్ ప్రియాంక, ఎస్‌ఈ ఎంబీ వెంకటేశ్వర్లు, ఈఈ ఎంబీ అరుణ్‌కుమార్‌రెడ్డి, డీవై ఈఈ ఎంపీ బిక్షం, ఆర్‌డబ్ల్యూఎస్ మిషన భగీరథ ఏఈ ఇంట్రా రుతిక్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2024 | 12:40 AM