ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి గింజనూ కొనుగోలు చేయాల్సిందే

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:46 AM

మిల్లుల వద్దకు తెచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ ఆదేశించారు. సోమవారం మద్దతు ధరకన్నా తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం శెట్టిపాలెం రోడ్డులోని కొన్ని మిల్లులను తనిఖీచేశారు.

డీటీసీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సబ్‌కలెక్టర్‌ నారాయణ అమిత

అతిక్రమిస్తే కేసులు నమోదు చేయిస్తాం

ఫ్లోటింగ్‌ను తగ్గించేందుకు రైతులకు టోకెన్లు

మిర్యాలగూడ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మిల్లుల వద్దకు తెచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ ఆదేశించారు. సోమవారం మద్దతు ధరకన్నా తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం శెట్టిపాలెం రోడ్డులోని కొన్ని మిల్లులను తనిఖీచేశారు. రైతుల వద్ద తక్కువకు ధాన్యం కొనుగోలు చేసిన మహర్షి మిల్లు యజమాన్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు సబ్మిట్‌ చేయాలని నోటీసులు జారీ చేశారు. అనంతరం అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ, సివిల్‌సప్లయ్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారులు రైస్‌మిల్లర్ల అసోసియేషన నేతలతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజనలో ఒకటి రెండు మండలాలు మినహయిస్తే మిగతా మండలాల్లో 20 శాతం కోతలు మాత్రమే పూర్తయినట్లు అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోందన్నారు. ఇప్పుడే మిల్లుల వద్ద పరిస్థితి ఈ విధంగా వుంటే మున్ముందు మరిన్ని సమస్యలు తలెత్తుతాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని బుధవారం నుంచి టోకెన విధానం అవలంభించనున్నట్లు తెలిపారు. మిల్లుల సామర్థ్యం మేరకు ఒక రోజు ముందుగానే ఏ మేరకు ధాన్యం తేవాలో రైతులకు టోకెన్లు పంపిణీ ద్వారా తెలియజేస్తామన్నారు. దీంతో ప్రతిరోజూ 3,000 ట్రాక్టర్ల వరకు మాత్రమే రైతులు ధాన్యాన్ని తీసుకవచ్చి ఇబ్బందులు లేకుండా విక్రయించేందుకు వీలుంటుందన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు ముగ్గురు చొపున టీంలు ఏర్పడి ఫుడ్‌సేప్టీ, పొల్యూషన కంట్రోల్‌బోర్డు, ధాన్యం ఎగుమతులు, కొనుగోళ్ల రికార్డులను తనిఖీ చేయాలన్నారు. రికార్డులు నమోదు చేయని మిల్లులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ రాజశేఖరరాజు, తహసీల్దార్లు హరిబాబు, కోటేశ్వరీ, రూరల్‌ సీఐ వీరబాబు, మిల్లర్స్‌ అసోసియేషన నాయకులు గౌరు శ్రీనివాస్‌, బాబ్జి, కుశలయ్య పాల్గొన్నారు.

బుద్ధి ఉందా.. గాడిదలు కాస్తున్నారా?

డీటీసీఎస్‌పై సబ్‌కలెక్టర్‌ మండిపాటు

మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొంటుంటే చర్యలు తీసుకోకుండా ఏంపని చేస్తున్నావు, బుద్ధి ఉందా అంటూ సివిల్‌సప్లయ్‌ డిప్యూటీ తహసీల్దార్‌పై సబ్‌కలెక్టర్‌ నారాయణ అమిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నధాన్యాన్ని క్వింటా రూ.2,150లకే కొనుగోలు చేశారని ఫిర్యాదులు అందడంతో మిర్యాలగూడ పట్టణలోని నల్లగొండ రోడ్డులోని మహర్షి రైస్‌మిల్లును ఆయన తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు రశీదును పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర కంటే తక్కువ కొంటుంటే గాడిదలు కాస్తున్నావా అంటూ డీటీ సీఎస్‌ జావిద్‌పై అసహనం వ్యక్తం చేశారు. మిల్లర్ల సమావేశంలో క్వింటా ధాన్యాన్ని రూ.2400కు తగ్గకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. కావాలనే మహర్షి మిల్లు యజమాన్యం కొనుగోలు నిలిపివేసి ధాన్యం ట్రాక్టర్లను బయట నిలబెట్టి తక్కువకు కొనుగోలు చేస్తోందన్నారు. మిల్లు యాజమాన్యం రిజిస్టర్‌ కూడా నిర్వహిస్తలేదన్నారు. మిల్లల్లో సమస్య తలెత్తినా చర్యలు తప్పవని, అవసరమైతే క్రిమినల్‌ చర్యలకు వెనుకాడమన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:46 AM