ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:48 AM

ప్రజాపాలన విజయోత్సవాల్లో భా గంగా డిసెంబరు 7వ తేదీ వరకు ప్రభుత్వ పథకాపై సాంస్కృతిక సారధి కళా బృందాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవా రం ప్రజాపాలన కళా యాత్ర ప్రచార రథా న్ని కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నల్లగొండ టౌన్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భా గంగా డిసెంబరు 7వ తేదీ వరకు ప్రభుత్వ పథకాపై సాంస్కృతిక సారధి కళా బృందాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవా రం ప్రజాపాలన కళా యాత్ర ప్రచార రథా న్ని కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సాంస్కృతిక సారథి కళాకారులు డిసెంబరు 7వ తేదీ వరకు ప్రతీ రోజు రెండు మేజర్‌ పంచాయతీలతోపాటు, సంబంధిత మండల కేంద్రాల్లో ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న జిల్లా కేంద్రంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ అలేఖ్య పుంజాల బృందం ఆధ్వర్యంలో ‘జయ జయహే.. ప్రజాపాలన’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబరు 4న జిల్లా కేంద్రంలో అంత దూపుల నాగరాజు ఆధ్వర్యంలో ‘ప్రజా ప్రభుత్వం పిలిచింది’ పేరున జానపద డ్యాన్‌, డ్రామా ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రులతో పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారని తెలిపారు. గ్రామాల్లో చేపట్టనున్న కళాజాత కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు ముందుగానే టామ్‌ టామ్‌ ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

జాప్యం లేకుండా ఇసుక సరఫరా చేయాలి

సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ఇసుకను ఎలాంటి జాప్యం లేకుండా సరఫరా చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ తన ఛాంబ ర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. శాలిగౌరారం మండలం వంగమర్తి ఇసుక రీచ్‌ నుంచి ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఇసుకను ఇచ్చేందుకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. అంతేగాక దేవరకొండ మండలం ము దిగొండ ఇసుక రీచ్‌ నుంచి డిండి, కిష్టరాయన్‌పల్లి ఎత్తిపోతల పథకాలకు లక్ష క్యూబిక్‌ మీటర్ల ఇసుకను గుర్తించి సరఫరా చేసేందుకు ఆమో దం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై అధికారులు దృష్టి కేంద్రీకరించి ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జే.శ్రీనివాస్‌, జిల్లా మైన్స్‌శాఖ ఏడీ జాకబ్‌, జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఈఈలు శ్రీనివా్‌సరెడ్డి, యాదవ్‌, ఎలమంద, డీఐవో వెంకటేశ్వర్లు, టీజీ ఎండీసీ పీవో రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బీ.వెల్లెంల ప్రాజెక్టును సందర్శన

(ఆంధ్రజ్యోతి, నార్కట్‌పల్లి): మండలంలోని బీ.వెల్లెంలలో ఉద య సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఈనెల 28న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారన్న సమాచారం మే రకు ప్రాజెక్టును ఆమె సందర్శించారు. తొలుత పంప్‌హౌస్‌, సర్జీపూల్‌ను,అనంతరం పంపింగ్‌ ద్వారా రిజార్వయర్‌లోకి విడుదలవుతు న్న నీటిని పరిశీలించారు.ప్రాజెక్టు లక్ష్యం, స్వరూపాన్ని ఈఈ గంగం శ్రీనివా్‌సరెడ్డి ఆమెకు వివరించారు. నిర్మాణంలో ఉన్న శిలాఫలకం దిమ్మె, హెలీప్యాడ్‌కు అనువైన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ వెం ట సీఈ అజయ్‌కుమార్‌, డీఈఈ విఠలేశ్వర్‌, శ్రీనివాస్‌, జేఈఈలు, ఆర్‌ఐ తరుణ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఊశయ్య ఉన్నారు.

ట్రామా కేర్‌ సెంటర్‌ ప్రతిపాదిత స్థలాన్ని సిద్ధం చేయాలి

(ఆంధ్రజ్యోతి, కట్టంగూరు): మండలంలోని పామనగుండ్ల గ్రా మంలో జాతీయ రహదారి పక్కన ట్రామా కేర్‌ సెంటర్‌ నిర్మించే ప్రతిపాదిత స్థలాన్ని చదును చేయాలని తహసీల్దార్‌ గుగులోతు ప్రసాద్‌ను కలెక్టర్‌ ఇలా త్రిపాఠీ ఆదేశించారు. మంగళవారం ఈ స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించి మాట్లాడారు. హైవే నుంచి ట్రామాకేర్‌ సెంటర్‌ వరకు బాటను చదును చేయడంతో పాటు భవనం నిర్మించేందుకు స్థలాన్ని చదును చేయాలని ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీవో అశోక్‌రెడ్డి, మాతృనాయక్‌, ఆర్‌ఐ కుమార్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:48 AM