ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
ABN, Publish Date - Oct 16 , 2024 | 12:43 AM
:ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం భువనగిరి లో నిరసన ర్యాలీ నిర్వహించారు.
యాజమాన్యాల నిరసన ర్యాలీ
మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాలు
భువనగిరిటౌన్, చౌటుప్పల్ టౌన్, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి):ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం భువనగిరి లో నిరసన ర్యాలీ నిర్వహించారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు యాజమాన్యాలకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశా రు. ఈ సందర్భంగా యాజామాన్యాల ప్రతినిధులు చిక్కా ప్రభాకర్‌గౌడ్, సింగనబోయిన మల్లేశం, దరిపల్లి నవీన్‌కుమార్, దరిపల్లి ప్రవీణ్‌కుమార్, మణిపాల్‌రెడ్డి మాట్లాడు తూ తమ న్యాయపరమైన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల్లో సమస్యలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ కళాశాలలబంద్ పాటిస్తామన్నారు. కా ర్యక్రమంలో లెక్చరర్లు, పలు సంఘాల ప్రతినిధులు శ్రీనివా స్, జి ఎల్లేష్, కే రమేష్, సంతోష్, జి వెంకన్న, నవీన్, బాలేశ్వర్, వెంకటరమణ, రాజు, శ్రవణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆందోళనలు ఉధృతం చేస్తాం
పెండింగ్ స్కాలర్‌షి్‌పలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యం సంఘం ఎంజీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని చౌటుప్పల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కళాశాలల యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఆర్డీవో శేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సుభాష్ రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్, విష్ణు కుమార్, మహేందర్‌రెడ్డి, ఆంజనేయులు, జంగయ్య పాల్గొన్నారు.
Updated Date - Oct 16 , 2024 | 12:43 AM