మూసీ కాల్వలకు నిధులు మంజూరు చేయాలి
ABN, Publish Date - Oct 16 , 2024 | 12:44 AM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయి న మూసీ కాల్వలకు నిధులు మంజూరు చేసి భువనగిరి నియోజకవర్గానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మంగళవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరారు.
మంత్రి ఉత్తమ్‌ను కలిసిన ఎమ్మెల్యే కుంభం
భువనగిరి రూరల్, అక్టోబరు15(ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయి న మూసీ కాల్వలకు నిధులు మంజూరు చేసి భువనగిరి నియోజకవర్గానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మంగళవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరారు. నియోజకవర్గ పరిధిలో అసంపూర్తిగా నిలిచిన బునాదిగా ని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలకు నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత రైతులకు సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా చిన్నేరు వాగుపై వడపర్తి, అనాజీపురం, బొల్లేపల్లి, మాదారం వద్ద నాలుగు చెక్‌డ్యాంల నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మైన ర్ ఇరిగేషన్ ఈఎన్‌సీ చంద్రశేఖర్, డిప్యూటీ ఈఎన్‌సీ శ్రీ నివా్‌సను ఎమ్మెల్యే కుంభం కలిసి బొల్లేపల్లి, బీమలింగం, అలినగర్ కాల్వల అభివృద్ధిపై చర్చించారు. ఆయన వెం ట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారె డ్డి, ఎల్లంల జంగయ్య, నానం కృష్ణ, వెంకట స్వామి, శివానంద్, శ్రీనివాస చారి, పిన్నం రాజు, వీరస్వామి, జీలుగు సతీష్ పవన్, రాంపల్లి కృష్ణ తదితరులున్నారు.
Updated Date - Oct 16 , 2024 | 12:44 AM