ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:40 AM

గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని యాదాద్రి జోన్‌ ఏసీపీ రమేశ్‌కుమార్‌ సూచించారు. మండలకేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం శాంతి కమిటీ, గణేశ్‌ మండప నిర్వాహకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పా ల్గొని మాట్లాడారు.

యాదాద్రి జోన్‌ ఏసీపీ రమేశ్‌కుమార్‌

తుర్కపల్లి, సెప్టెంబరు 4: గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని యాదాద్రి జోన్‌ ఏసీపీ రమేశ్‌కుమార్‌ సూచించారు. మండలకేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం శాంతి కమిటీ, గణేశ్‌ మండప నిర్వాహకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. గణేశ్‌ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్‌ అనుమతి తీసుకోవాలన్నారు. గణేశ్‌ మండపాలను ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చదువుకునే విద్యార్థులకు ఇబ్బందులు క లుగకుండా తక్కువ శబ్ధంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వద్ద డీజేను ఏర్పాటు చేసుకోవద్దని నిర్వాహకులకు సూచించారు. వేడుకల సమయంలో అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ సామరస్యాన్ని కొనసాగించాలని కోరారు. సమావేశంలో యాదగిరిగుట్ట రూరల్‌ సీఐ ఎం. కొండల్‌రావు, ఎస్‌ఐ మహ్మద్‌ తక్యుద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:40 AM

Advertising
Advertising