ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తిభావంతో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించాలి

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:17 AM

జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ భక్తిభావంతో గణేష్‌ నవరాత్రోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, పక్కన ఎస్పీ సనప్రీతసింగ్‌

సూర్యాపేట క్రైం, సెప్టెంబరు 5:జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ భక్తిభావంతో గణేష్‌ నవరాత్రోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సనప్రీతసింగ్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా శాంతికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్‌ ఉత్సవాల్లో ప్లాస్టిక్‌ను వినియోంచవద్దన్నారు. బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలను నెలకొల్పేందుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సోదరభావంతో మెలగాలన్నారు. అధికారులు, ఉత్సవ కమిటీలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నవరాత్రోత్సవాలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు.

ఘర్షణలకు తావులేకుండా ఉండాలి

ఘర్షణలకు తావులేకుండా గణేష్‌ ఉత్సవాలను నిర్వహించాలని ఎస్పీ సనప్రీతసింగ్‌ అన్నారు. జిల్లాలో ఎప్పుడైనా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని అదేవిధానాన్ని కొనసాగించాలన్నారు. గణేష్‌ ఉత్సవాల కారణంగా గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. గణేష్‌ మండపాల వద్ద నిర్వాహకులు 24 గంటల పాటు ఉండాలని ఆదేశించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా మండపాలను ఏర్పాటు చేయాలన్నారు.విద్యాసంస్థలు, ప్రార్థనామందిరాలు, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలకు సమీపంలో గణేష్‌ మండపాలు ఏర్పాటు చేయవద్దన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వర్‌రావు, డీఎస్పీలు మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, జీ రవి, ఆర్డీవో వేణుమాధవ్‌, శాంతి కమిటీ సభ్యులు రుక్మారావు, చకిలం రాజేశ్వర్‌రావు, ఫకృద్దిన, హఫీజ్‌ఖలీల్‌, అంజద్‌అలీ, కక్కిరేణి శ్రీనివాస్‌, గండూరి రమేష్‌, రియాజుద్దిన, జలీల్‌, జానీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కార్మికుల కుటుంబాలకు అండగా కార్మిక శాఖ

సూర్యాపేట(కలెక్టరేట్‌): కార్మికుల కుటుంబాలకు అండగా కార్మికశాఖ ఉంటుందని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కోదాడకు చెందిన లారీ డ్రైవర్‌ అంజయ్య కుటుంబసభ్యులకు కలెక్టరేట్‌లో కార్మికశాఖ కార్యాలయంలో కార్మికశాఖ ద్వారా మంజూరైన రూ.6.10లక్షలను బీమాచెక్కును అంద జేసి, మాట్లాడారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా రుణమాఫీపై కలెక్టరేట్‌లో ఏర్పాటు కంట్రోల్‌రూంను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ జగదీ్‌షకుమార్‌, సిబ్బంది తండు సందీప్‌, విజయలక్ష్మి, శ్రీనివాస్‌, అర్షద్‌, షరీఫ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 12:17 AM

Advertising
Advertising