ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండు మాసాల్లో దర్గాకు ఘాట్‌ రోడ్డు

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:16 AM

జిల్లా కేంద్రం క్లాక్‌ టవర్‌ సెంటర్‌లోని హజ్రత్‌ సయ్యద్‌ లతీఫుల్లా షాఖాద్రి దర్గాను భక్తులు దర్శించుకునేందుకు రెండు నెలల్లో ఘాట్‌ రోడ్డును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఉర్సు ఉత్సవాలు ప్రారంభం

ఆకర్షణగా నిలిచిన మార్ఫా వాయిద్యాలు

నల్లగొండ కల్చరల్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం క్లాక్‌ టవర్‌ సెంటర్‌లోని హజ్రత్‌ సయ్యద్‌ లతీఫుల్లా షాఖాద్రి దర్గాను భక్తులు దర్శించుకునేందుకు రెండు నెలల్లో ఘాట్‌ రోడ్డును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మదీనా మసీద్‌లో సంప్రదాయ పద్దతిలో ప్రార్ధన అనంతరం గంధం ఊరేగింపును కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్గా వద్దకు వెళ్లేందుకు గట్టపైకి ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి రూ.30కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. వృద్ధులు, మహిళలు సైతం దర్గాను దర్శించుకునేందుకు వీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తన హాయంలోనే దర్గా అభివృద్ధి చెందిందని, గత 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. హిందువులు, ముస్లింలు ఐక్యమత్యంతో జరుపుకునే ఉత్సవం ఉర్సు లని, ఈ సంప్రదాయాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలన్నారు. దక్షిణ భారతదేశంలో గుట్టపై ఉన్న ఏకైక దర్గాగా లతీఫుల్లా ఖాద్రీ దర్గా ప్రసిద్ధి చెందిందన్నారు. అనంతరం గంధాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగించగా, గుట్టమెట్ల దగ్గరికి చేరుకోగానే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు స్వాగతం పలికి దర్గాపైకి తీసుకెళ్లారు. ముతవళ్లులు ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. గంధం ఊరేగింపులో మార్ఫా వాయిద్య కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లోని ఫంకాలను కూడా ఊరేగింపుగా తీసుకొచ్చారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ నుంచి కూడా పోలీస్‌ గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. దర్గా ప్రాంతమంతా భక్తులతో సందడిగా మారింది. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతోపాటు మునిసిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమే్‌షగౌడ్‌, ముతవళ్లులు సమీల్లాఖాద్రీ, హవేజ్‌, ఉబేద్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎక్కడా లేని విధంగా బొట్టుగూడ పాఠశాల నిర్మాణం

నల్లగొండ టౌన్‌: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా రూ.3కోట్లతో జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్నత పాఠశాలను నిర్మిస్తున్నట్టు మంత్రి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం పాఠశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అన్ని తరగతి గదుల్లో డిజిటల్‌ పాఠాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని గదుల్లో ఏసీతో పాటు విద్యార్థులకు లిఫ్ట్‌ సౌకర్యం కల్పించాలని, పార్కిం గ్‌, అధునాతన టైల్స్‌, ఫ్లోరింగ్‌, ఎలక్ట్రిల్‌ లైటింగ్‌ పనుల్లో నాణ్యత లోపించకుండా చేపట్టాలని ఆదేశించారు.

క్రీడలకు అధిక ప్రాధాన్యం

నల్లగొండ స్పోర్ట్స్‌: రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కు అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సీఎం కప్‌- 2024 టార్చ్‌ ర్యాలీ గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌కు చేరింది. క్రీడా జ్యోతిని అందుకున్న మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత క్రీడాకారు ల్లో క్రీడలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం టార్చ్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు క్రీడా జ్యోతిని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రారంభించారు. హైదరాబా ద్‌ రోడ్‌ నుంచి ఈ ర్యాలీ క్లాక్‌ టవర్‌ వర కు సాగింది. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, కాంగ్రె స్‌ పట్ణణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, డీవైఎ్‌సవో సిహెచ్‌.విష్ణుమూర్తిగౌడ్‌, హఫీజ్‌ఖాన్‌, శంభులింగం, కిరణ్‌కుమార్‌, నజీర్‌, పీఈటీలు పుల్లయ్య, ప్రవీణ్‌కుమార్‌, గిరిబాబు, కరీం, దాసు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 01:16 AM