స్వర్ణతాపడం చకచకా
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:30 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులు చకచకా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి గుట్ట ఆలయాన్ని దర్శించుకొని స్వర్ణతాపడం పనులపై ఆరా తీశా రు.
ఈ నెల 15నుంచి ప్రారంభం కానున్న పనులు
పనులపై సీఎం ఆరా
తాపడం అనంతరం మహాకుంభాభిషేకం
పెండింగ్ పనులపై ప్రభుత్వం దృష్టి
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులు చకచకా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి గుట్ట ఆలయాన్ని దర్శించుకొని స్వర్ణతాపడం పనులపై ఆరా తీశా రు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి తాపడం రేకులను అమర్చే పనులు ప్రారంభంకానున్నాయి. ఈ పనులు పూర్తి అనంతరం మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా పెం డింగ్ పనులపై కూడా ప్రభుత్వం దృష్టిసారించింది.
గుట్టలో స్వామివారివారి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు రెండేళ్లుగా పెం డింగ్‌లో ఉంది. స్వామివారి ఆలయానికి స్వర్ణతాపడం పనులు వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణ యం తీసుకన్నారు. శుక్రవారం గుట్టకు వచ్చిన సీఎం దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిలా ్లకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తో కలిసి ఆలయ పనులపై సమీక్ష కూడా నిర్వహించా రు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారు లు శైలజారామయ్యర్, హనుమంత్ కే.జెండగే, ఆలయ ఈవో భాస్కర్‌రావు తదితరులు విమానగోపురం స్వర్ణతాపడం పనుల పురోగతిని సీఎంకు వివరించారు. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం రికా ర్డు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికే దక్కుతుంది. విమాన గోపురానికి బంగారం తాపడం అమర్చే పనులు ఈ నెల 15నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి 20లోగా పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. తాపడం పనులు ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి చెందిన మెసర్స్ స్మార్ట్ క్రియోషన్స్‌కు అప్పగించింది. ఇప్పటికే రాగి రేకులపై బంగారం తాపడం పనులు కొంత మేర పూర్తయ్యాయి. మొత్తం 10వేల చదరపు అడుగుల బంగారం తాపడం చేపట్టాల్సి ఉండగా, ఇప్ప టి వరకు 1,600చదరపు అడుగుల మేర పూర్తయింది. చదరపు అడుగుకు రూ.3,900 చొప్పున ప్రభుత్వం సద రు సంస్థకు చెల్లించనుంది. మొత్తంగా అందుకు రూ.3.90కోట్లు ఖర్చు కానుంది. స్వామివారి ప్రధానాల యం విమాన గోపురం 10,500ఎస్‌ఎ్‌ఫటీల మేరకు ఉం ది. 60కిలోల బంగారంతో తాపడం పూర్తికానుందని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం ఆలయ అధికారుల వద్ద బంగారం తాపడం కోసం భక్తులు సమర్పించిన చందాలు రూ.20.50కోట్ల మేరకు ఉన్నాయి. భక్తులు స్వామివారికి మొక్కల రూపంలో సమర్పించిన బంగారు సుమారు 12కిలోల వరకు ఉంది. భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారం 10.500కిలోల వరకు ఉంది. అదేవిధంగా స్వామివారికి భక్తులు సమర్పించిన వెండి 2,300కిలోల వరకు ఉంది. బంగారంతో పాటు ప్రస్తుతం ఆలయ బ్యాంకు ఖాతాలో ఉన్న విరాళాలు నిధులతో 60కిలలో వరకు బంగారం సమకూరే అవకాశం ఉంది. బంగారు తాపడం పనుల కోసం భక్తులు, దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. 2025 మార్చిలో నిర్వహించే బ్రహ్మోత్సవాల వరకువిమానగోపురం బంగారుతాపడం పనులు పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
స్వర్ణతాపడం అనంతరం మహాకుంభాభిషేకం
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు ముందుగా 1,008 కుండలాలతో యాగం చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చినజీయర్‌స్వామికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య విభేదాలు రావడంతో యాగం వాయిదా పడింది. అప్పటికే పలు యాగశాలల నిర్మాణాలు చేపట్టినప్పటికీ, ప్రభుత్వం సాధారణంగానే బాలాలయంలో యాగాలు చేసి ఆలయ సంప్రోక్షణ పూజలు చేపట్టింది. అనంతరం 2022 మార్చి 28న ఆలయ ఉద్ఘాటన నిర్వహించింది. అయితే ఆలయ ఉద్ఘాటన సమయంలో ఎవ్వరినీ ఆహ్వానించకుండా, మంత్రులు, ప్రజాప్రతినిఽధులతో ఆలయ ఉద్ఘాటన పూర్తిచేశారు. దీనిపై ప్రతిపక్షాలతోపాటు పలు ధార్మిక సంస్థలు విమర్శలు వ్యక్తం చేశాయి. కాగా, విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తిచేశాక మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2025 మార్చి 1వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈలోగా విమానగోపురానికి స్వర్ణతాపడం పనులు పూర్తి చేసి, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో స్వామివారి చెంతన మహాకుంభాభిషేకం అనంతరం బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 15నుంచి బంగారు తాపడం అమర్చే పనులకు మొత్తం 60కిలోల బంగారం వినియోగిస్తుండగా, గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ చార్జీలకు మొత్తం రూ.8కోట్లు వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులపై సర్కారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. వైటీడీఏ చేపట్టిన పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులపై నివేదికను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
స్వర్ణతాపడం పనులు వేగవంతం చేస్తున్నాం :భాస్కర్‌రావు, ఆలయ ఈవో
స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముందుగానే విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాగి రేకులపై బంగారు తాపడం పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 15నుంచి పనులు వేగవంతం చేయనున్నాం. మార్చి 1నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈలోగా విమానగోపురానికి స్వర్ణతాపడం పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
Updated Date - Nov 10 , 2024 | 12:30 AM