ఆంధ్రా నుంచి ధాన్యం
ABN, Publish Date - Dec 18 , 2024 | 12:06 AM
ఆంధ్రా నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం వస్తుండడం తో అధికారులు అప్రమత్తమై ఇప్పటికే సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచారు. దీంతోపా టు అదనంగా మరో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
చెక్‌పోస్టుల వద్ద పటిష్ఠ బందోబస్తు
సరిహద్దుల్లో అదనంగా మరో రెండు ఏర్పాటు
(ఆంధ్రజ్యోతి,కోదాడ రూరల్): ఆంధ్రా నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం వస్తుండడం తో అధికారులు అప్రమత్తమై ఇప్పటికే సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచారు. దీంతోపా టు అదనంగా మరో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం సన్న ధాన్యానికి క్వింటా కు రూ.500 బోనస్ ఇస్తోంది. దీంతో ఏపీ రాష్ట్రం నుంచి కొంతమంది దళారులు రాత్రివేళల్లో సరిహద్దు చెక్‌పోస్టును తప్పించుకుని అడ్డదారుల్లో ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని రామాపురం క్రాస్ రోడ్డు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద అధికారులు బందోబస్తును పటిష్ఠపరిచారు. సోమవారం అర్ధరాత్రి 20కి పైగా లారీల్లో వచ్చిన ధాన్యాన్ని గుర్తించి వెనక్కిపంపినట్లు చెక్‌పోస్ట్ అధికారులు తెలిపా రు. దీంతో దళారులు మరిన్ని అడ్డదారులు వెతు క్కున్నారు. చెక్‌పోస్టుకు సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామం నుంచి రెడ్లకుంట, కాపుగల్లు గ్రామాల మీదుగా కోదాడ, అక్కడి నుంచి సూర్యాపేటకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. అంతేగాక రాత్రివేళలో ఖమ్మం జిల్లా మీ దుగా లారీలు కొండపల్లి, అనంతగిరి మండలం గోండ్రియాల మీదుగా కోదాడ మిల్లులకు ధాన్యం తరలిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఏపీ రాష్ట్రం జగ్గయ్యపేట, వత్సవాయి మం డలాల నుంచి ధాన్యం రాత్రివేళలో పెద్ద మొత్తం లో కోదాడకు వస్తోంది. దీన్ని గుర్తించిన అధికారు లు చెక్‌పోస్టుల వద్ద బందోబస్తు పటిష్ఠం చేయడంతోపాటు అన్నవరం, రెడ్లకుంట మధ్య మరో చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి ధాన్యం రాకుండా అనంతగిరి మండలం గోండ్రియాల వద్ద మరో చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. దీంతో ఏపీ నుంచి ధాన్యం వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
ఏపీ ధాన్యాన్ని కట్టడి చేయాలి
(ఆంధ్రజ్యోతి, అనంతగిరి, మేళ్లచెర్వు, మఠంపల్లి): మండల పరిధిలోని గోండ్రియాల గ్రామం మీదుగా ఏపీ రాష్ట్రం నుంచి ధాన్యం రాకుండా కట్టడి చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం పౌరసరఫరాలశాఖ రాజేశ్వరరావుతో కలిసి గోండ్రియాల గ్రామంలో చెక్‌పోస్టు ఏర్పాటును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్, రెవెన్యూ శాఖలు రెండు బృందాలుగా ఏర్పడి చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్లు వాజిద్ అలీ, హిమబిందు, ఎస్‌ఐ అనిల్‌కుమార్, తదితరులు ఉన్నారు. అదేవిధంగా చింతలపాలెం మండలంలోని కృష్ణానదిపై ఉన్న చింతిర్యాల బల్లకట్టు, పులిచింతల ప్రాజెక్టు, బుగ్గమాదారం బల్లకట్టు, దొండపాడు చెక్‌పోస్టు, మేళ్లచెర్వు మండలంలోని రామాపురం చెక్‌పోస్టులను అదనపు కలెక్టర్ రాంబాబు పరిశీలించారు. మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టును తనిఖీ చేశారు. ఇక్కడ గతంలో ఇద్దరు పోలీసులు ఉండగా, మరో ఇద్దరిని అదనంగా కేటాయించి పటిష్ఠంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. వారి వెంట ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్లు సురేందర్‌రెడ్డి, మంగా, డీటీసీఎ్‌సలు రాంరెడ్డి, రాజశేఖర్, చింతపాలెం ఎస్‌ఐ అంతిరెడ్డి, ఆర్‌ఐ వాసుదేవరావు, తదితరులు ఉన్నారు.
Updated Date - Dec 18 , 2024 | 12:06 AM