ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

ABN, Publish Date - Apr 12 , 2024 | 12:16 AM

మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఆత్మకూరు(ఎం) ఏప్రిల్‌ 11: మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని కూరెళ్ల, రాఘవాపురం గ్రామాల్లో ఽ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, 15రోజుల నుంచి ధాన్యాన్ని కేంద్రాలను తరలిస్తున్నప్పటికీ తూకాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కనీసం ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా సమయాన్ని ప్రకటించకపోవడం ధారుణమన్నారు. గత ఏడాది కూడా అధికారులు ఆలస్యంగా కేంధ్రాలను ప్రారంభించంతో వాతావరణం అనూకూలించక రైతులు చాలా వరకు నష్టపోయారని, వెంటనే కోనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కూరెళ్ల, రాఘవాపురం గ్రామాల్లో భువనగిరి ఎంపీగా సీపీఎం అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. నాయకులు రచ్చ గోవర్ధన, టి.యాదయ్య, బుగ్గయ్య, రాములు, బీరయ్య, యాదిరెడ్డి, సత్తయ్య, అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:16 AM

Advertising
Advertising