ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు

ABN, Publish Date - Dec 15 , 2024 | 12:39 AM

టీజీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలు ఆది, సోమవారం జరగనున్నాయి. అం దుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజులు, రెండు పూట లు పరీక్షలు జరగనున్నాయి.

జిల్లాలో 14 కేంద్రాలు, 6,078 మంది అభ్యర్థులు, 417 మంది సిబ్బంది

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్‌): టీజీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలు ఆది, సోమవారం జరగనున్నాయి. అం దుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజులు, రెండు పూట లు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను కలెక్టర్‌ ఎం.హనుమంతరావు శనివారం పరిశీలించారు.

జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో 11, పట్టణ శివారులోని అనంతారంలో మూడు మొత్తంగా 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 6,078 మంది పరీక్ష రాయనున్నారు. 417 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వీరిలో 254 మంది ఇన్విజిలేటర్లు, 65 మంది ఐడెంటీఫికేషన్‌ అధికారులు, 44 మంది బయోమెట్రిక్‌ పరిశీలకులు, 14 మంది డీఈవోలు, 16 మంది పరిశీలకులు, 16 మంది సీఎ్‌ఫలు, ఏసీఎ్‌ఫలు, ఐదుగురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ముగ్గురు జాయింట్‌ ఫొటో ఆఫీసర్స్‌ విధుల్లో పాల్గొననున్నారు. రెండు రోజులూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందుగా పరీక్షా కేంద్రాల గేట్లను మూసి వేస్తారు. గేట్లు మూసి వేశాక వచ్చే అభ్యర్థులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు. పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షలు జరిగినంతసేపు పోలీసులు 144వ సెక్షన్‌ను అమలు చేయనున్నారు. సమీపంలోని జిరాక్స్‌, ఆన్‌లైన్‌ సెంటర్స్‌ను మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు తీసుకున్నారు. తాగునీరు, వైద్య సిబ్బంది తదితర ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల రూట్‌ మ్యాప్‌లను ప్రధాన రహదారుల వెంట పోలీసులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేయనున్నారు.

పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్‌

పరీక్షల్లో అవకతవకల నివారణకు ప్రతీ అభ్యర్థి బయోమెట్రిక్‌ను అధికారులు సేకరిస్తారు. హాల్‌టికెట్‌, ఆధార్‌కార్డు తదితర గుర్తింపు కార్డులను ప్రత్యేక బృందాలు పరిశీలిస్తాయి. సెల్‌ ఫోన్‌, చేతి గడియారాలు తదితర ఎలక్ర్టానిక్‌ వస్తువులను అనుమతించరు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లలో ఫోటో స్పష్టంగా లేకుంటే గెజిటెడ్‌ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌తో అటెస్టేషన్‌ చేసిన 3 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలను, వెబ్‌సైట్‌లో పొందుపర్చిన ధ్రువీకరణ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. కేవలం చెప్పులను మాత్రమే ధరించాలి. ఎలాంటి ఆభరణాలు ధరించరాదు. బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే పరీక్ష రాయాలి. ప్రతీ అరగంటకు ఒకసారి సిబ్బంది గంట మోగిస్తారు.

16న ప్రజావాణి రద్దు

(ఆంధ్రజ్యోతి,భువనగిరి (కలెక్టరేట్‌)):గ్రూప్‌-2 పరీక్షల నేపథ్యంలో సో మవారం జరిగే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్‌ ఎం.హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు శాఖల జిల్లా అధికారులు గ్రూప్‌-2 పరీక్ష విధులు నిర్వహిస్తున్నారని అందుకే ‘ప్రజావాణి’ని దర్దుచేశామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

పకడ్బందీ ఏర్పాట్లు చేశాం ఞ: ఎం.హనుమంతరావు, కలెక్టర్‌

గ్రూప్‌-2 పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అందుకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చి ఇబ్బంది పడవద్దు. పరీక్షల నిర్వహణపై వచ్చే వదంతులను నమ్మవద్దు. ఏకాగ్రతతో పరీక్ష రాసి విజయం సాఽ దించాలి. గ్రూప్‌-2 పరీక్ష రాయనున్న జిల్లా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు.

Updated Date - Dec 15 , 2024 | 12:39 AM