గ్రూప్-2 తొలిరోజు పరీక్షలు ప్రశాంతం
ABN, Publish Date - Dec 16 , 2024 | 12:34 AM
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు జిల్లాలో ఆదివా రం ప్రశాంతంగా సాగాయి. పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం కట్టుదిట్ట భద్రతా ఏర్పా ట్లు చేసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూ టలు పరీక్ష నిర్వహించారు.
14 పరీక్షా కేంద్రాలు, 6,078 మంది అభ్యర్థులు
సగానికి పైగా గైర్హాజరు
పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
భువనగిరి (కలెక్టరేట్), డిసెంబరు 15 (ఆం ధ్రజ్యోతి): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు జిల్లాలో ఆదివా రం ప్రశాంతంగా సాగాయి. పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం కట్టుదిట్ట భద్రతా ఏర్పా ట్లు చేసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూ టలు పరీక్ష నిర్వహించారు. 14 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేశారు. ప్రతీ అభ్యర్థిని క్షుణ్ణంగా తని ఖీ చేసి పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు.
6,078 మంది హాజరు
గ్రూప్-2 పరీక్షలకు 14 కేంద్రాల్లో ఉదయం మొత్తం 6,078 అభ్యర్థులకు 2,971 మంది హాజరయ్యారు. 3,107 గైర్హాజరయ్యారు. అదేవిధంగా మఽఽధ్యాహ్నం2,961 హాజరుకాగా,3,117మంది గైర్హాజరయ్యారు. సగానికి పైగా అభ్యర్థులు రాలేదు.
నిమిషం ఆలస్యంతో వెనుదిరిగిన అభ్యర్థులు
టీజీపీఎ్‌ససీ నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, కేంద్రాలకు అర్ధగంట ముందే అభ్యర్థులు చేరుకోవాలి. నిమిషం ఆలస్యం అయినా అనుమతించరు. పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు.
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
జిల్లాలో గ్రూప్-2 పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎం.హనుమంతరావు తనిఖీ చేశారు. పట్టణంలోని యూనిటీ కాలేజీ, టైమ్స్, వెన్నెల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీచేశారు. అభ్యర్థుల హాజరుశాతం, సీసీ కెమెరాల పనితీరు, బయోమెట్రిక్ హాజరు అమలు విధానాన్ని పరిశీలించారు. కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Updated Date - Dec 16 , 2024 | 12:34 AM