నూతన కలెక్టర్‌గా హనుమంతరావు
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:56 AM
సమాచార, పౌరసంబంధాల, దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న హనుమంతరావు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
పర్యాటక శాఖ డైరెక్టర్‌గా హనుమంతు కే.జెండగే బదిలీ
యాదాద్రి, అక్టోబరు28(ఆంధ్రజ్యోతి): సమాచార, పౌరసంబంధాల, దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న హనుమంతరావు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంతకుముందు కలెక్టర్ హనుమంతు కె. జెండగే బదిలీ అయ్యారు. సోమవారం హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. హనుమంతు కే.జెండగేను పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. జెండగే జిల్లాలో సంవత్సరం కాలంగా పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలమేరకు ఆయన కలెక్టర్‌గా ఇక్కడికి బదిలీపై వచ్చారు. కలెక్టర్‌గా, జిల్లా ఎన్నికల అధికారిగా శాసనసభ, లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు.
అదనపు కలెక్టర్‌గా జి.వీరారెడ్డి
అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.బెన్‌షాలోం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హెచ్‌ఎండీఏలో ఎస్టేట్ ఆఫీసర్‌గా చేస్తున్న జి.వీరారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బెనషాలోమ్‌ను నారాయణపేట్ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా బదిలీ చేశారు. వీరారెడ్డి గతంలో యాదాద్రిభువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బాధ్యతలు నిర్వర్తించి, ఎన్నికల సమంలో బదిలీ అయ్యారు. అదేవిధంగా భువనగిరి రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్.అమరేంద్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి సంక్షేమ అధికారిగా పనిచేస్తున్న కృష్ణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అమరేందర్‌ను నల్లగొండ జిల్లా డీఆర్వోగా బదిలీ చేసింది.
Updated Date - Oct 29 , 2024 | 12:56 AM