ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు అభివృద్ధికి చేయూత

ABN, Publish Date - Oct 26 , 2024 | 12:38 AM

గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం చేయూత ఇస్తుందని తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(టీజీఐఐసీ) చైర్‌పర్సన్‌ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో కొత్తగా ఏర్పాటుచేసిన ఎన్విరోఫ్లూయిడ్స్‌ పరిశ్రమను ఆమె ప్రారంభించారు.

టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మల జగ్గారెడ్డి

చౌటుప్పల్‌ రూరల్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం చేయూత ఇస్తుందని తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(టీజీఐఐసీ) చైర్‌పర్సన్‌ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో కొత్తగా ఏర్పాటుచేసిన ఎన్విరోఫ్లూయిడ్స్‌ పరిశ్రమను ఆమె ప్రారంభించారు. అనంతరం ఇక్కడి పలు పరిశ్రమలను సందర్శించారు. పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇక్కడి పార్కు విశేషాలను తెలంగాణ ఇండస్ట్రియల్‌ వెల్ఫేర్‌ (టీఫ్‌) అధ్యక్షుడు సుదీర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. పార్కు అభివృద్ధికి శ్రమించిన టీఫ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడి పరిశ్రమలకు కావాల్సిన నీటి సరఫరా, 132కేవీ సబ్‌స్టేషన్‌, రవాణా సౌకర్యం, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌ప వంటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఫ్‌ కార్యదర్శి గోపాల్‌రావు, జోనల్‌ మేనేజర్‌ సంతోష్‌, గోవిందరెడ్డి, స్వామిగౌడ్‌, యాదయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, రమేశ్‌, శ్రీనివాస్‌, ఎన్విరో ఫ్లూయిడ్స్‌ సంస్థ ఎండీ రవినాయక్‌, పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2024 | 12:38 AM