ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలి

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:37 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని, అందుకు జిల్లా పోలీ్‌సశాఖ ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు వెళ్తోందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిని డీఎస్పీ శివరాంరెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఎస్పీ మంగళవారం పరిశీలించారు.

ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

పలు ప్రాంతాలను దత్తత తీసుకున్న పోలీస్‌ అధికారులు

నల్లగొండ క్రైం, అక్టోబరు 1: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని, అందుకు జిల్లా పోలీ్‌సశాఖ ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు వెళ్తోందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిని డీఎస్పీ శివరాంరెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల విలువైన ప్రాణాలు కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దత్తత మండలాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను అధికారులు ప్రతీ వారం సందర్శించి ప్రమాదాల నివారణకు నివేదిక పంపడంతోపాటు అవసరమైన చర్యలు తీసుకుంటారన్నారు. అద్దంకి రోడ్డు, చర్లపల్లి బైపాస్‌ బ్లాక్‌ స్పాట్‌ వద్ద వేగ నియంత్రణ సూచికలు, స్టడ్స్‌, బ్లింకింగ్‌ లైట్లు, రేడియం స్టిక్కర్లు, సర్వీసు రోడ్లు, పాదచారుల రక్షణ గోడలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పనులను ప్రారంభించామన్నారు. చెర్వుగట్టు వద్ద భక్తులు రోడ్డు దాటే క్రమంలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎల్లారెడ్డిగూడెం, చెర్వు గట్టు, అన్నెపర్తి 12వ బెటాలియన్‌ వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబు, నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతి, డీటీఆర్‌బీ రిటైర్డ్‌ సీఐ అంజయ్య, రోడ్డు సేఫ్టీ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:37 AM