ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉంది?

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:16 AM

పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉంది? ఇమ్యూనైజేషన ప్రక్రియ ఎలా ఉంది, ఫలితాలు ఎలా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచవో) చెందిన వైద్యులు ఎస్‌.అనూష, డేవిడ్‌ ఆరా తీశారు.

చిట్యాల పీహెచసీలో రికార్డులను పరిశీలిస్తున్న డబ్ల్యూహెచవో డాక్టర్లు

చిట్యాల, సెప్టెంబరు11: పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉంది? ఇమ్యూనైజేషన ప్రక్రియ ఎలా ఉంది, ఫలితాలు ఎలా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచవో) చెందిన వైద్యులు ఎస్‌.అనూష, డేవిడ్‌ ఆరా తీశారు. బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని పీహెచసీని డబ్ల్యూహెచవో వైద్యుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు ఆస్పత్రిలో అందుతున్న సేవలు, ఇమ్యూనైజేషన ప్రక్రియను పరిశీలించారు. ఎంత మందికి టీకాలు(ఇమ్యూనైజేషన) వేశారు? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యూనైజేషన అధికారి డాక్టర్‌ ఎస్‌.పద్మ మాట్లాడుతూ టీకాలు వేయించుకుంటే 14రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుని దోమలను నివారించాలని కోరారు. కార్యక్రమంలో పీహెచసీ వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎస్‌పీవో కృష్ణ, ఆసుపత్రి సిబ్బంది నర్సింగరావు, ఉదయ్‌రాజు తదితరుల పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:16 AM

Advertising
Advertising