అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN, Publish Date - Dec 14 , 2024 | 01:46 AM
అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు నిర్మించి, పేదవారి సొంతింటి కల నెరవేర్చుతామని కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ను శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రారంభించి మాట్లాడారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును యాప్‌లో నమోదు చేయాలన్నారు.
కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
భువనగిరి (కలెక్టరేట్), డిసెంబరు 13 (ఆంధ్రజ్యో తి): అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు నిర్మించి, పేదవారి సొంతింటి కల నెరవేర్చుతామని కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ను శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రారంభించి మాట్లాడారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును యాప్‌లో నమోదు చేయాలన్నారు. మొదటి దఫాలో నియోజకవర్గానికి 3500 ఇళ్లను నిర్మించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. లబ్ధిదారులకు ప్రాధాన్య క్రమంలో ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. కుల గణన జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించామని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాలన్నారు. అర్హులైన వారు మాత్రమే ఇళ్లు పొందుతారని, నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్యూమరేటర్లు మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎన్.శోభారాణి, హౌసింగ్ డిప్యూటీ ఈఈ నాగేశ్వరరావు, డీఈ శ్రీరాములు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Updated Date - Dec 14 , 2024 | 01:46 AM