తైక్వాండోలో అంతర్జాతీయ స్థాయికి..
ABN, Publish Date - Oct 30 , 2024 | 01:09 AM
ప్రతిభ ఉం టే ప్రపంచ స్థాయికి వెళ్లవచ్చని నిరూపిస్తున్నా డు.. తైక్వాండో పోటీల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు.
వివిధ పోటీల్లో పతకాలు
ఏషియన గేమ్స్‌లో శ్రీకాంతకు స్థానం
భువనగిరి రూరల్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రతిభ ఉం టే ప్రపంచ స్థాయికి వెళ్లవచ్చని నిరూపిస్తున్నా డు.. తైక్వాండో పోటీల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన కొనరెడ్డి శంకరయ్య నర్సమ్మ దంపతుల చిన్న కుమారుడు శ్రీకాంత బాల్యం నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై మక్కువతో తైక్వాండో నేర్చుకుని పలు వేదికలపై సత్తా చాటి ఏషియన గేమ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అతని అన్న కొనరెడ్డి కుమార స్వామి మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని హెచపిసీఎల్‌లో ఎలక్ర్టీషియనగా పని చేస్తున్నాడు. శ్రీకాంత సోదరి జ్యోతి గృహిణిగా ఉంది. శ్రీకాంత బీబీనగర్ మండలంలోని హారికా హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో క్రీడలపై ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే 2002లో భువనగిరి పట్టణానికి చెందిన కరాటే బాలరాజు అనే మాస్టర్ వద్ద జూడో శిక్షణ తీసుకున్నాడు. అనివార్య కారణాలు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఏడు సంవత్సరాలు ఎలాంటి క్రీడల్లో పాల్గొనలేదు. 2009లో మాస్టర్ గుర్రం కృష్ణ శ్రీకాంత నైపుణ్యాన్ని గుర్తించి అతని ప్రోత్సాహంతో క్రీడల్లో పాల్గొంటూ వచ్చాడు.
శ్రీకాంత సాధించిన అవార్డులు
2004లో హన్మకొండలోని జైఎనఎ్‌స గ్రౌండ్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో సిల్వర్ మెడల్. 2005లో జిల్లా స్థాయి పాఠశాలల జూడో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2005-06లో ఆంధ్రప్రదేశలోని కడప జిల్లా రాయచోటిలో నిర్వహించిన 61వ రాష్ట్ర పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. 2008-09లో ఆంధ్రప్రదేశలో జూడో అసొసియేషన జూనియర్ ఇంటర్ జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2009లో ఆంధ్రప్రదేశలోని కర్నూలు జిల్లా నందికొట్కురులో జరిగిన జిల్లా స్థాయి జూడో చాంపియనషి్‌పలో సిల్వర్ మెడల్ సాధించాడు. 2011లో చౌటుప్పల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2012లో రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్‌లో జరిగిన ఇంటర్మీడియట్ పాఠశాల స్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2012 భువనగిరిలోని ప్రెసిడెన్సీ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2013లో రంగారెడ్డి జిల్లా చర్లపల్లిలో శాంతినికేతన హైస్కూల్‌లో నిర్వహించిన 13వ ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించాడు. 2014లో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో స్కూ ల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన నిర్వహించిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్,సిల్వర్ పతకాలు సాధించాడు. 2014లో రంగారెడ్డి జిల్లా రాంపల్లిలో నిర్వహించిన ఫస్ట్ స్టూ డెంట్ ఒలంపిక్ అసొసియేషన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మోడల్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. 2015లో మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో నిర్వహించిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి ఏషియన గేమ్స్‌కు ఎంపికయ్యాడు. 2015 ఫిబ్రవరి 13,14,15 తేదీల్లో నేపాల్ దేశ రాజధాని ఖాట్మాండ్‌లో నిర్వహించిన ఏషియన గేమ్స్‌లో సిల్వర్, కాంస్య పతకాలు సాధించాడు. 2016-17, 2018-19లో ఫెడరేషన ఆఫ్ ఇండి యాఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి తైక్వాండో న్యాయ నిర్ణేతల పోటీలో కాంస్య పతకం సాధించాడు. 2023లో గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న మహిళలకు ఆత్మరక్షణ అంశంపై శిక్షణ ఇచ్చాడు. 2024లో మేడ్చల్ మల్కాజిగిరిలో ఆర్యవైశ్య కల్యాణ మండపంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు పౌండర్ డాక్టర్ చింతపట్ల వెంకటచారి నిర్వహించిన తైక్వాండో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. రాజస్థానలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నాడు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శిక్షణ
తైక్వాండోను గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు నేర్పాలనే లక్ష్యంతో రోజుకో గ్రామంలో శిక్ష ణ ఇస్తున్నాడు. ప్రస్తుతం భువనగిరిలోని జీనియస్ స్కూల్‌లో పార్ట్‌టైంగా విధులు నిర్వహిస్తున్నాడు. 2010నుంచి 2024 వరకు దాదాపు 5వేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు. పలు కార్యక్రమా ల్లో నైపు ణ్యం, ప్రతిభ కనబరిచి దాదాపు 100 మంది విద్యార్థులు బంగారుపతకాలు, 210 విద్యార్ధులు సిల్వర్, కాంస్య పతకాలు సాధించారు.
తైక్వాండోతో ఆత్మ రక్షణ
తైక్వాండోతో ఇప్పటివరకు ఐదు వేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. సంపూర్ణ ఆరోగ్యానికి, ఆత్మరక్షణకు ఈ క్రీడ ఎంతగానో దోహదపడుతుంది. నైపుణ్యం కలిగిన క్రీడాకారులను తయారు చేయడం కోసం ప్రతీ రోజు పలు పాఠశాలల ఆవరణల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం శిక్షణ ఇస్తున్నాను. ఏషియన గేమ్స్‌లో పాల్గొని కాంస్య, సిల్వర్ పతకాలు సాధించినందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మరింతగా గుర్తింపు పొందేందుకు శ్రమిస్తున్నాను. నేను తెక్వాండోలో ఎదగడానికి గురువు మాస్టర్ గుర్రం కృష్ణ, బావ అంగడి నాగరాజు ఎంతో ప్రోత్సహించారు.
- కొనరెడ్డి శ్రీకాంత, కోచ, తైక్వాండో
Updated Date - Oct 30 , 2024 | 06:47 AM