ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐక్యరాజ్య సమితి సమావేశాలకు బ్రహ్మచారికి ఆహ్వానం

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:06 AM

ఐక్యరాజ్యసమితి నుంచి సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కోడూరుకు చెందిన మారోజు బ్రహ్మచారికి ఆహ్వానం అందింది. ఈ నెల 4న స్విట్జర్లాండ్‌ దేశం జెనీవా నగరంలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో సునామీలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు.

మారోజు బ్రహ్మచారి

అర్వపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఐక్యరాజ్యసమితి నుంచి సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కోడూరుకు చెందిన మారోజు బ్రహ్మచారికి ఆహ్వానం అందింది. ఈ నెల 4న స్విట్జర్లాండ్‌ దేశం జెనీవా నగరంలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో సునామీలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రపంచ మానవహక్కుల సమితి జాతీయ లీగల్‌ సెల్‌ చైర్మనగా వ్యవహరిస్తున్న బ్రహ్మచారికి ఆహ్వానం అందింది. ఆరేళ్లుగా డబ్ల్యూహెచఆర్‌సీ తరపున సేవలు అందిస్తూ దేశంలో వివిధ కార్యక్రమాలల్లో బ్రహ్మచారి పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తెలంగాణకు నుంచి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని బ్రహ్మచారి అన్నారు. ప్రపంచ మానవ హక్కుల సమితి, యునైటెడ్‌ ఫీస్‌కీపర్స్‌ ఫెడరల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి దేశంలో సుస్థిర లక్ష్యాలకు అనుగుణంగా సామాజిక, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి పనిచేస్తుందని బ్రహ్మచారి తెలిపారు. సమావేశాలకు హాజరయ్యే అవకాశం దక్కడం సంతోషకరమన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 12:06 AM