ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘పది’ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:59 PM

పదో తరగతి పరీక్షలు జిల్లా సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ, వివేకవాణి విద్యామందిర్‌ పాఠశాలల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, మాట్లాడారు.

సూర్యాపేటలోని పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

సూర్యాపేట అర్బన, మార్చి 18 : పదో తరగతి పరీక్షలు జిల్లా సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ, వివేకవాణి విద్యామందిర్‌ పాఠశాలల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశాంత వాతావరణంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మొబైల్‌ఫోన్సను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిలేదని సూచించారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోని అనుమతించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇనచార్జి ఎంఈవో శైలజ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం

జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 67 కేంద్రాలను ఏర్పాటుచేయగా మొత్తం 11,946 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 11,904 మంది హాజరు కాగా 42 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా మొదటిసారి ఫెయిల్‌ అయిన 18మంది విద్యార్థులు పరీక్ష రాయల్సి ఉండగా వారిలో 17 మంది పరీక్ష రాయగా ఒక్కరు గైర్హాజరయ్యారని డీఈవో అశోక్‌ తెలిపారు.

ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు

జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసినట్లు కలెక్టర్‌ వెంకటరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎలక్షన ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌రూంను అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతతో కలసి ప్రారంభించి, మాట్లాడారు. సీవిజిల్‌, 1950కాల్‌సెంటర్‌, సువిధ పర్మిషన్స, ఎనజీఆర్‌పీఎ్‌స పోర్టల్‌ అదేవిధంగా పీడబ్ల్యూడీ సాక్షమ్‌ యాప్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించే దిశగా యాప్‌లను అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అప్పారావు, ఏవో సుదర్శనరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరాజు, ఈడీఎం గఫార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:59 PM

Advertising
Advertising