ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జనగామను పాపన్న జిల్లాగా మార్చాలి

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:27 AM

జనగామ జిల్లా పేరును పాపన్న జిల్లాగా మార్చాలని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేశకుమార్‌ను సన్మానిస్తున్న మామిడి రామకృష్ణ, ఇతరులు

నార్కట్‌పల్లి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లా పేరును పాపన్న జిల్లాగా మార్చాలని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల శ్రీ నూతన గౌడ సంఘం ఏర్పాటు చేసిన సందర్భంగా టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటను ఏలిన సర్దార్‌ సర్వార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని గోల్కొండ కోటలో ప్రతిష్ఠించాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి హైబ్రీడ్‌ తాటి, ఈత, ఖర్జూర వనాలను పెంచాలని పేర్కొన్నారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా తాటికల్లును ఉస్మానియా యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా నిర్ధారించినందున కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదనేలా ప్రభుత్వమే ప్రచారం చేయాలని అన్నారు. కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రతీ గీత కార్మికునికి అందజేసేలా ప్రభుత్వం చొరవ చూపేందుకు కృషి చేయాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మహే్‌షకుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోరిగాడి ఉపేందర్‌, నాతి రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి బత్తుల రవీందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మిట్టపల్లి విజయ్‌, సలహాదారు ముద్దగోని రామ్మోహన, అధికార ప్రతినిధి బండమీది కనకరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:27 AM