ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివాహితితతో ఖాకీ... వివాహేతర సంబంధం?

ABN, Publish Date - Dec 15 , 2024 | 12:31 AM

ఖాకీ నడుపుతున్న అక్రమ సంబంధంతో ఆ కుటుంబంలో చిచ్చురేగింది. ఇద్దరు పిల్లలున్న యువతితో సదరు పోలీస్‌ అధికారి రహస్యసంబంధం నడుపుతున్న విషయాన్ని పసిగట్టిన భర్త ఆధారాలు సహా సేకరించి జిల్లా పోలీ్‌సబా్‌సకి సదరు ఖాకీపై ఫిర్యాదు చేయడంతో విషయం రచ్చకెక్కింది.

నల్లగొండ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖాకీ నడుపుతున్న అక్రమ సంబంధంతో ఆ కుటుంబంలో చిచ్చురేగింది. ఇద్దరు పిల్లలున్న యువతితో సదరు పోలీస్‌ అధికారి రహస్యసంబంధం నడుపుతున్న విషయాన్ని పసిగట్టిన భర్త ఆధారాలు సహా సేకరించి జిల్లా పోలీ్‌సబా్‌సకి సదరు ఖాకీపై ఫిర్యాదు చేయడంతో విషయం రచ్చకెక్కింది. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లాకు చెందిన ఒక పోలీస్‌ సీఐ పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న యువతితో రహస్యసంబంధం నడుపుతూ ఆమె భర్తని వేధింపులకు లోను చేస్తున్నారని, అతడికి సంబంధించి భూమి విక్రయించి భార్యకు ఇవ్వాలని హెచ్చరిస్తున్నారని పేర్కొంటూ ఆమె భర్త ఇటీవల జిల్లా ఎస్పీ శరతచంద్రపవార్‌కి ఫిర్యాదుచేశారు. తన భార్యని ట్రాప్‌లోకి దింపిన సదరు సీఐ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తమ కుటుంబంలో చిచ్చురేపారని ఆమె భర్త పేర్కొంటున్నారు. తన భార్యతో సదరు సీఐ అసహజమైన, వివాహేతర సంబంధాన్ని రుజువు చేసేలా వాట్సాప్‌ ఛాటింగ్‌ చేశారని, అతడి ప్రోత్సాహంతోనే తన భార్య తనపై పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసిందని ఆమె భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. త న స్వగ్రామంలో తన తల్లిపేరున ఉన్న భూమిని విక్రయించి తన భార్యకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని, తన భార్య, సీఐ ఇద్దరు కలిసి తనపై కుట్రపన్నారని, తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని భర్త ఫిర్యాదులో ఆధారాలతో పేర్కొనడం పోలీ్‌సవర్గాల్లోనూ సంచలనం రేకెత్తించింది.

ప్రేమించి మరీ వివాహం చేసుకున్న దంపతులు

జిల్లాకే చెందిన ఈ దంపతులు పద్నాలుగేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. పట్టణంలో చిరువ్యాపారం చేసుకుంటూ, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఆమె పేరున రెండెకరాల భూమిని కొనడంతో పాటు, ఇళ్ల స్థలమూ కొన్నారు. ఎంతో అన్యోన్యంగా కాలం గడుపుతున్న క్రమంలోనే సొంతూర్లో ఉన్న రెండెకరాల భూమిని విక్రయించి, కొంత బ్యాంకు రుణం తీసుకొని జిల్లాకేంద్రంలో ఇల్లు కట్టుకున్నారు. దీంతో కొంత అప్పులపాలవడం, చేసే వ్యాపారంతో ఇల్లు గడవడం, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు పెరగడంతో అప్పు తీర్చే మార్గం లేక భార్యాభర్తలిద్దరూ కలిసి నిర్ణయించుకొనే ఇం టిని విక్రయించారు. బ్యాంకులో అప్పు తీర్చారు. బ్యాంకులో క్లియరెన్స కోసం బైక్‌పై భార్యాభర్తలిద్దరూ వెళ్లే క్రమంలో ఉన్నట్లుండి భార్య పోలీ్‌సస్టేషనలోకి వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. అప్పటివరకు ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాను ఖంగుతిన్నానని, ఎందుకిలా చేస్తుందో అర్థంకాలేదని భర్త పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు తర్వాత విక్రయించిన ఇంటిని కూడా క్యాన్సిల్‌ చేసేలా కొన్నవారిపై సీఐ ఒత్తిడి తెచ్చారని, దీంతో వారికి ఇంటిని హ్యాండోవర్‌ చేయలేకపోయామని భర్త పేర్కొన్నారు. ఇంటిని కొనే నిమిత్తం వారిచ్చిన డబ్బుని తన సొంతూర్లో తల్లిపేరున ఉన్న భూమిని విక్రయించి తెచ్చి చెల్లించమని సీఐ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తన భార్య ఎందుకిలా ప్రవర్తిస్తుందనే దానిపై తాను విచారణ జరపగా, ఆమెతో సీఐ వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం తనకు తెలిసిందని, తన భార్య ఫోన ద్వారా చేసిన వాట్సాప్‌ ఛాటింగ్‌తో వారిద్దరి సంబంధం రుజువు చేసుకున్నానని పేర్కొన్నారు.

తనభార్యచేత ఉద్దేశ్యపూర్వకంగా ఇప్పించిన ఫిర్యాదు ఆధారం చేసుకొని సదరు సీఐ తనని పదేపదే స్టేషనకి పిలిపించి, సొంతూర్లో తన తల్లి పేరున ఉన్న భూమి విక్రయించి డబ్బులు తెచ్చి, ఇంటిని విక్రయించిన వారికి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని, అలా చేస్తేనే కేసు తొలగించి, భార్య నుంచి విడాకులిప్పిస్తానని బెదిరిస్తున్నారని భర్త పేర్కొంటున్నారు. తన ఇంట్లోకి తాను వెళ్లే పరిస్థితి లేకుండా చేసి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సీఐ తన భార్యని ట్రాప్‌ చేశారని, ఆమెకు ఫ్లాట్‌ ఇప్పిస్తానని, డబ్బులిస్తానని, పెళ్లి చేసుకుంటానని సదరు సీఐ మభ్యపెట్టి పచ్చటి తమసంసారంలో చిచ్చుపెట్టారని ఆమె భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్య, సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని నేరుగా ఎస్పీకి ఫిర్యాదుచేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే అతడి భార్య కూడా తన భర్త తనని నమ్మించి ప్రేమవివాహం చేసుకొన్నారని, ఆ తర్వాత వేధింపులకు లోనుచేస్తున్నారని పేర్కొంటూ ఫిర్యాదు చేయడంతో పోలీస్‌ ఉన్న తాధికారులు ఈ కేసుపై లోతుగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతుండడంతో పోలీ్‌సవర్గాల్లోనూ ఈ వ్యవహారంపై చర్చ కొనసాగుతోంది.

విచారణకు ఆదేశించాం, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం

ఒక సీఐపై ఆరోపణలతో మాకు ఫిర్యాదు వచ్చింది. దీనిపై ఇప్పటికే డీఎస్పీచేత విచారణ జరిపిస్తున్నాం. అన్నికోణాల్లో విచారణ జరిపించాక వచ్చిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటాం.

శరతచంద్రపవార్‌, ఎస్పీ నల్లగొండ

Updated Date - Dec 15 , 2024 | 12:31 AM