ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చేనేత పథకాలపై అవగాహన అవసరం

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:57 AM

చేనేత సంక్షేమ పథకాలపై కార్మికులు, మాస్టర్‌ వీవర్స్‌, వ్యాపారులు అవగాహన పెంచుకోవాలని ఎంఎ్‌సఎంఈ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌.సుమతి అన్నారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి పట్టణంలో పద్మశాలీ యువజన సంఘం, ఎంఎ్‌సఎంఈ ఆధ్వర్యంలో ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం నిర్వహించారు.

ఎంఎ్‌సఎంఈ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌.సుమతి

భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : చేనేత సంక్షేమ పథకాలపై కార్మికులు, మాస్టర్‌ వీవర్స్‌, వ్యాపారులు అవగాహన పెంచుకోవాలని ఎంఎ్‌సఎంఈ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌.సుమతి అన్నారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి పట్టణంలో పద్మశాలీ యువజన సంఘం, ఎంఎ్‌సఎంఈ ఆధ్వర్యంలో ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఈ-కామర్స్‌, చేనేత ఎగుమతులు, వస్త్రోత్పత్తులు, ఎంఎ్‌సఎంఈ స్కీమ్‌, చేనేత విభాగం అమలు చేసే సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుమతీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా విభాగాల ద్వారా చేనేత రంగానికి అందిస్తున్న పథకాలపై అవగాహన పెంచుకోవాలని, మార్కెటింగ్‌ వనరులను పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో నల్లగొండ డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.రఘునాథస్వామి, వివిధ శాఖల అధికారులు ఆర్‌.కులకర్ణి, టి.సుధీన్‌పాల్‌, పి.రవీందర్‌, హ్యాండ్లూమ్‌ డీవో శ్రీనివాస్‌ తదితరులు చేనేత ఇక్కత్‌ వ్యాపారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ది పోచంపల్లి కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ తడక రమేష్‌, పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు భారత లవకుమార్‌, పద్మశాలీ చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, సూరపల్లి రాము, సూరపల్లి రమేష్‌, గంజి యుగేందర్‌, రుద్ర చంద్రప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 12:57 AM