మత్స్యగిరిపై వైభవంగా ధ్వజారోహనం
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:55 AM
మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి.
వలిగొండ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. గరుఢ ధ్వజ ప్రతిష్ట, పల్లకి ధ్వజారోహణం, బలిప్రదానం, దేవతాహ్వానం, హోమక్రతువులు, భేరీ పూజా సోమవారం ఈ బ్రహ్మోత్సవాలకు నలుమూలల నుంచి ప్రజలు తరలిరాగా మత్స్యగిరికొండపై భక్తుల కోలాహలంతో బ్రహ్మోత్సవ సందడి నెలకొంది. లోక కల్యాణం విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతలకు నిలయంగా మత్స్యాద్రి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. యాగశాలకు ద్వారతోరణార్చన జరిపి, ఆగమ శాస్త్రరీతిలో బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ్మంతుడిని ఆహ్వానించడానికి ధ్వజారోహణ తంతును అర్చకులు జరిపారు. స్వామివారి గర్భాలయం ముందు గరుత్మంతుడి చిత్రపటం వేసి ముగ్ధమనోహరంగా, శాస్త్ర బద్దంగా అలంకరించారు. వేదమంత్రాలతో దేవతలను కొలిచి గరుత్మంతుడి పటాన్ని ధ్వజపతాకంపై చిత్రీకరించారు. గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. ఈ కార్యక్రమం రుత్వికులు, వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణ, నాదస్వర సప్తరాగాల నడుమ సాగింది. ఈ నేపథ్యంలో గరుడుడునిని ఆహ్వానించడానికి గరుడ ముద్దను ఎగురవేశారు. ఈ గరుడ ప్రసాదం స్వీకరిస్తే సౌభాగ్యం, సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
పల్లకి సేవ
స్వయంభూ నారసింహుడి స్వామి ప్రధాన గర్భాలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను ఆల యం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారిని అధిష్ఠింపజేసి, స్వామిని భుజాలపైన మోస్తూ తరలించారు. హరినామ స్తోత్రాలు పటిస్తూ స్వామివారి కొలనుచుట్టూ ప్రదక్షిణలు చేసి కల్యాణ వేదిక వద్దకు తరలించారు. పల్లకి సేవ నేత్రానందంగా సాగింది.
భేరీ పూజ
మత్స్యగిరి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను ఆహ్వానించడానికి సోమవారం రాత్రి భేరీ పూజా, దేవతాహ్వాన కార్యక్రమాలు జరిగాయి. సప్త స్వరాలు, ఇష్ట వాయిద్యాలతో దిక్పాలకులను ఆహ్వానించారు. శబ్ద బ్రహ్మం, మూలమంత్ర జపంతో ప్రధాన వాయిద్య భేరీని మోగించి కంకణధారణ చేయడం ఉత్సవ ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
హోమం
శ్రీ లక్ష్మీనారసింహుడి ఉత్సవ అతిధులుగా 33 కోట్ల మంది దేవతలను ఆహ్వానించి వారిని పంచసూక్తాలతో సంతృప్తి పరిచే హవన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. క్షేత్ర వైభవం ఇనుమడింపజేస్తూ లక్ష్మీనారసింహుడి మూలమంత్ర జప పారాయణం చేశారు. కార్యక్రమంలో దేవాలయ ఈవో మోహనబాబు, రుత్వీకులు, అర్బక బృందం, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మత్స్యగిరి దేవస్థానం నూతన చైర్మనగా నరే్‌షరెడ్డి
వలిగొండ మండలంలోని వెంకటపురం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొమ్మరెడ్డి నరేష్‌రెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం మత్స్యగిరి గుట్టపైన నూతన పాలక మండలి ధర్మకర్త దేవాదాయ ధర్మాదాయశాఖ భువనగిరి డివిజన పరిశీలకులు వెంకటలక్ష్మీ ప్రమాణస్వీకారం చేయించారు. ధర్మకర్తలుగా కొడితల కరుణాకర్, అరూరు వెంకటేష్, రేకల ప్రభాకర్, మైళ్ల అంజయ్య, బండి రవికుమార్, గుండు జగనమోహనరెడ్డి, అంబాల ఉషయ్య, ఈతప రాములు, జక్కుల కేతమ్మ, మైసోళ్ల వెంకటేషం, కొమిరే బాలేశ్వర్, కందుల శ్రీను, గజ్జెల అమరేందర్, ఎక్స్ అిఫీషియల్ సభ్యులు ప్రతాపురం శ్రీనివా్‌సచార్యులు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం కార్వనిర్వహణ అధికారి స్వలాది మోహనబాబు, మాజీ ఎంపీపీ నూతి రమే్‌షరాజు, జనార్థనరెడ్డి నాయకులు అనంతరెడ్డి, రామ్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, వెంకటపాపిరెడ్డి, రవి, సత్తిరెడ్డి, ఉపేందర్, లింగయ్య, కొత్త వెంకటేశం, రాములు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 12:55 AM