హుజూర్‌నగర్‌లో 27న మహారుద్రాభిషేకం
ABN, Publish Date - Oct 17 , 2024 | 12:20 AM
హుజూర్‌నగర్ పట్టణంలోని ఎన్‌ఎ్‌సపీ క్యాంప్‌లో ఈ నెల 27న మహారుద్రాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఎనిమిది అడుగుల మృత్తిక(మట్టి) శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయనున్నారు.
హుజూర్‌నగర్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : హుజూర్‌నగర్ పట్టణంలోని ఎన్‌ఎ్‌సపీ క్యాంప్‌లో ఈ నెల 27న మహారుద్రాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఎనిమిది అడుగుల మృత్తిక(మట్టి) శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయనున్నారు. కాశీ క్షేత్రానికి చెందిన 45 మంది నాగసాధువులు ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. ఈ వేడుకల కోసం రెండు నెలలుగా ఏర్పాట్లుచేస్తున్నారు. 10వేల మందికి పైగా భక్తులతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్ గజ్జి ప్రభాకర్, కమిటీ సభ్యుడు ఓరుగంటి నాగేశ్వరరావు, కీతా మల్లికార్జున్‌రావు, గుండా శ్రీనివాసరావు, విజయ్ తెలిపారు. లక్ష రుద్రాక్షలతో అభిషేకం, పూలు, పండ్లు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హిమాలయాలలో ఉండే నాగసాధువు శివబాబా ఆధ్వర్యంలో 200 కిలోల పసుపు, 200 కిలోల కుంకుమ, 300 కిలోల విభూది, 200 కిలోల గంధం, 150 కిలోల గంధసింధూరం, 150 లీటర్ల ఆవుపాలు, 10 కిలోల ఆవు నెయ్యి, 10 కిలోల తేనె, 600 కిలోల పూలు, 50 కిలోల నవగ్రహ దినుసులు, 250 లీటర్ల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు.
Updated Date - Oct 17 , 2024 | 12:20 AM