అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి: ఎస్పీ
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:46 AM
పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ సనప్రీతసింగ్ అన్నారు.
సూర్యాపేట క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ సనప్రీతసింగ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పట్టణంలో 2కే రన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు చేసే కఠినమైన విధులను ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతో 2కే రనను నిర్వహించామన్నారు. అమరులను అనునిత్యం స్మరించుకుంటూ నిరంతరం ప్రజల్లో చిరస్మరణీయంగా ఉండటానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలతో పోలీసులు సత్సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయన్నారు. గంజాయి సమాజంలో చాలా ప్రమాదకరమైందన్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. చదువులో వెనుకబడి ఒత్తిడికి గురైన వారు మత్తు పదార్థాలు తీసుకుంటే ఉత్సాహం వస్తుందనేది అవాస్తవమన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు 2కే రన నిర్వహించారు. ఈ రనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, పోలీసులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు మేక నాగేశ్వర్‌రావు, జనార్ధనరెడ్డి, డీఎస్పీలు జీ రవి, నర్సింహాచారి, సీఐలు గురుకుల రాజశేఖర్, వై. సురేందర్‌రెడ్డి, ఆర్‌ఐ నారాయణరాజుతో పాటు పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మోతె : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీసులు పనిచేయాలని ఎస్పీ సనప్రీత సింగ్ అన్నారు. సోమవారం మోతె మండల పోలీ్‌సస్టేషనను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టేషన ఆవరణలో మొక్కలు నాటారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో కోదాడ డీఏస్పీ శ్రీధర్‌రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ యదేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Oct 29 , 2024 | 12:46 AM