ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూసీ పునరుజ్జీవ యాత్రకు తరలిరావాలి

ABN, Publish Date - Nov 06 , 2024 | 01:26 AM

సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్రకు స్వచ్ఛందంగా తరలిరావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని సంగెం గ్రామ మూసీ పరివాహక ప్రాంతంలో ఈ నెల 8న సీఎం రేవంత్‌రెడ్డి పునరుజ్జీవ యాత్రకు సభాస్థలాన్ని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

వలిగొండ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్రకు స్వచ్ఛందంగా తరలిరావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని సంగెం గ్రామ మూసీ పరివాహక ప్రాంతంలో ఈ నెల 8న సీఎం రేవంత్‌రెడ్డి పునరుజ్జీవ యాత్రకు సభాస్థలాన్ని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రివేణి సంగమం వద్ద కొలువుదీరిన భీమలింగేశ్వరుని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు. మూసీ వల్ల ఇబ్బందులు పడుతున్న కులవృత్తుల సమస్యలను తెలుసుకుంటారన్నారు. విషతుల్యమైన మూసీ నది వల్ల రైతులు, గౌడన్నలు, పద్మశాలీలు తదితర వృత్తుల వారితో సీఎం మాటామంతి నిర్వహిస్తారన్నారు. ఈ ప్రాంత ప్రజల సాధకబాధకాలను సీఎంకు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గతంలో చాలామంది రైతులు మూసీ ప్రక్షాళనకోసం ఉద్యమాలు చేశారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల కల మూసీ ప్రక్షాళన అని, అది నెరవేరే సమయం దగ్గరకొచ్చిందన్నారు. సీఎం పాదయాత్రకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతరావు, డీసీపీ రాజే్‌షచంద్ర, మాజీ ఎంపీపీ నూతి రమే్‌షరాజు, నాయకులు అనంతరెడ్డి, సహదేవ్‌, బాలనర్సింహ, సత్తిరెడ్డి, సంజీవరెడ్డి, కిష్టయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రామన్నపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తుమ్మలగూడెం చెరువుకు 3లక్షల చేపపిల్లలు మంజూరు కాగా మంగళవారం 90వేల చేపపిల్లలను విడుదలచేసి మాట్లాడారు. చెరువులే జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు పండాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతురావు, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీపీ రాజే్‌షచంద్ర, మత్స్యకార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు పాశం సంజయ్‌బాబు, మత్స్యశాఖ ఏడీ ఎం.రాజారాం, కాంగ్రెస్‌ నాయకులు జినుకల ప్రభాకర్‌, పూస బాలకిషన్‌, గంగుల రాజిరెడ్డి, నంద్యాల భిక్షంరెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, గంగుల కృష్ణరెడ్డి, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పుంటికూర శంకరయ్య, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పెద్దగోని వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 01:26 AM